Business Idea: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. ఆదాయమూ లక్షల్లోనే.. అదేంటంటే

|

Sep 07, 2024 | 11:13 AM

మనం ప్రతీ రోజూ తినే లంచ్‌లో ఏదొక పచ్చడి ఐటెం లేకపోతే అస్సలు ముద్ద దిగదు. ఇక బ్యాచిలర్లకైతే.. కర్రీ పాయింట్ నుంచి తీసుకొచ్చే కర్రీలతో పాటు ఆవకాయ్ పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే. అవునండీ.!

Business Idea: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. ఆదాయమూ లక్షల్లోనే.. అదేంటంటే
Business Idea
Follow us on

మనం ప్రతీ రోజూ తినే లంచ్‌లో ఏదొక పచ్చడి ఐటెం లేకపోతే అస్సలు ముద్ద దిగదు. ఇక బ్యాచిలర్లకైతే.. కర్రీ పాయింట్ నుంచి తీసుకొచ్చే కర్రీలతో పాటు ఆవకాయ్ పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే. అవునండీ.! పచ్చళ్ల బిజినెస్.. ఇప్పుడిదే ట్రెండింగ్. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ మహిళ కూడా ఇదే పచ్చళ్ల వ్యాపారంతో ప్రతి నెలా రూ.2.5 లక్షలు సంపాదిస్తోంది. ఆమె ఈ వ్యాపారాన్ని మొట్టమొదటిగా రూ. 4 వేల పెట్టుబడితో మొదలుపెట్టింది. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ అనే బ్రాండ్‌తో ఈమె ఈ పచ్చళ్ల బిజినెస్‌ను దేశమంతటా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో సదరు మహిళ బిజినెస్‌ను ప్రమోట్ చేసేందుకు ఆమె కుమారుడు సాయం చేశాడట. అలాగే తన వ్యాపారం బాగా ఊపందుకోవడంతో స్థానిక మహిళలకు కూడా ఈ పచ్చళ్ల వ్యాపారంతో ఉపాధి లభించిందట. పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్‌డ్ వెజిటేబుల్స్, తీపి మామిడి పచ్చళ్లతో పాటు నాన్‌వెజ్ పచ్చళ్లు కూడా ఈమె బాగా తయారు చేస్తుందట. మరి మీరూ సొంతంగా పచ్చళ్లు తయారు చేయాలనుకుంటుంటే..

– మీరు ఏ రకమైన ఊరగాయను తయారు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ చేసుకోండి.

– ఆ ఊరగాయ ఉత్పత్తికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్దం చేసుకోండి.

– ఇక అవసరమైన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల కోసం అప్లై చేసుకోండి.

– మీరు తయారు చేసిన ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా సరైన ఏర్పాట్లు చేసుకోండి.

– ఒకరిద్దరు ఉద్యోగులను మీకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసుకోండి.

– ఊరగాయ ఉత్పత్తుల ప్యాకేజింగ్, ధరలు నిర్దేశించండి..

– సోషల్ మీడియాను బ్రాండ్ ప్రమోషన్ కోసం వినియోగించండి.