చాలీచాలనంత జీతంతో సతమతమవుతున్నారా.? పని ఒత్తిడితో విసిగిపోయారా.? ఏదైనా వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీకో బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. ఈ బిజినెస్‌తో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను తెచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది మంచి ఉద్యోగాలను సైతం కాదని.. సొంతంగా స్టార్టప్స్ పెట్టుకోవడం లేదా వ్యాపారాలను చేయడం వైపు మొగ్గుచూపుతున్నారు. మరి అలాంటి వారికోసం ఈ బిజినెస్. అది మరేదో కాదండీ సెలూన్ బిజినెస్. దీని ద్వారా ప్రతీ నెలా లక్ష వరకు సంపాదించవచ్చు.
ఇప్పటి జనరేషన్‌కు సెలూన్ చాలా ముఖ్యం. దుమ్ము, దూళి వల్ల చర్మ ఆరోగ్యం ప్రతీరోజూ దెబ్బతింటూనే ఉంటుంది. అందుకే అందరికీ చర్మ సౌందర్యం ముఖ్యమైపోయింది. మరీ ముఖ్యంగా ఈ కాలం యువత తమ బ్యూటీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందుకే బ్యూటీ అండ్ వెల్‌నెస్ పార్లర్స్‌కు క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. మంచి డిమాండ్ ఉన్న చోట మీరు యూనిసెక్స్ సెలూన్ తెరవచ్చు. డిమాండ్ ఉన్న ప్లేస్‌లో షాప్ తెరవాలంటే.. కొంచెం డబ్బుతో కూడుకున్న పని. అయితే ఇంటీరియర్‌కు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. సెలూన్‌కు వచ్చే కస్టమర్లకు అద్భుతమైన సౌకర్యాలు అందించడం కోసం కొంచెం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పనిపై పట్టు సాధించినవారిని మీరు పనిలో పెట్టుకుంటే.. వ్యాపారం మాంచిగా సాగుతుంది. మంచి మార్కెటింగ్ ద్వారా మీరు ఈ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ లోన్ తీసుకుని కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అన్ని ఖర్చులు పోనూ ప్రతీ నెలా రూ.5 నుంచి 6 లక్షల వరకు సంపాదించవచ్చు.