Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం విపరీతంగా పెరిగింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు వీటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది. ఆటో కంపెనీలు మొత్తం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. కొత్త కొత్త EV మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఈ సమయంలో నిరుద్యోగులకు మంచి అవకాశం దొరికింది. ఛార్జింగ్ స్టేషన్లు తెరవడం ద్వారా అధికంగా సంపాదించడానికి అవకాశం ఉంది.
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ EVRE, స్మార్ట్ పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ పార్క్ ప్లస్ (పార్క్+) తో జతకట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్మార్ట్ ఛార్జింగ్, పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పన, నిర్మాణం, సంస్థాపన, ఆపరేషన్ నిర్వహణను చేపడితే.. పార్క్+ రియల్ ఎస్టేట్ నిర్వహిస్తుందని ప్రకటించారు.
ఛార్జింగ్ స్టేషన్ తెరవడానికి శిక్షణ
దేశంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడానికి ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి యువతకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ సమయంలో మీరు ఛార్జింగ్ స్టేషన్ గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు. దీంతో పాటు పని చేసే కొత్త పద్ధతులు కూడా నేర్పుతారు. శిక్షణలో మీకు మెకానిజం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్, సోలార్ పివి ఛార్జింగ్ కనెక్టివిటీ లోడ్లు, విద్యుత్ టారిఫ్ మొదలైన వాటి గురించి సమాచారం అందిస్తారు. ఈ శిక్షణలో ఈ వ్యాపారం గురించి మీకు పూర్తి సమాచారం అందిస్తారు. తర్వాత మీరు ఛార్జింగ్ స్టేషన్ తెరవడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు.
ఛార్జింగ్ స్టేషన్ ఎలా తెరవాలి
అనేక కంపెనీలు EV ఛార్జింగ్ స్టేషన్లను తెరవడానికి ఫ్రాంచైజీలను ప్రకటిస్తాయి. మీరు ఈ కంపెనీల నుంచి ఫ్రాంచైజీలను తీసుకోవడం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లను తెరవవచ్చు. ఒక అంచనా ప్రకారం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సుమారు రూ .4 లక్షలు ఖర్చు అవుతుంది.