Business Ideas: ఫ్యాన్‌ కింద కూర్చోని.. నెలకు రూ.1 లక్ష సంపాదించండి! డిమాండ్‌ తగ్గని బిజినెస్‌..

వ్యాపారం చేసి జీవితంలో ఎదగాలనుకునేవారికి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ అద్భుతమైన అవకాశం. రూ.10 లక్షల పెట్టుబడి తో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. వాహనాల పెరుగుదల, వాటికి అవసరమైన రిపేర్లు ఈ వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉండేలా చేస్తాయి.

Business Ideas: ఫ్యాన్‌ కింద కూర్చోని.. నెలకు రూ.1 లక్ష సంపాదించండి! డిమాండ్‌ తగ్గని బిజినెస్‌..
Money 5

Updated on: Dec 06, 2025 | 1:07 AM

వ్యాపారం చేస్తేనే జీవితంలో పైకొస్తామని అనుకునేవాళ్లకు ఈ బిజినెస్‌ ఐడియా బాగా సెట్‌ అవుతుంది. ఎందుకంటే.. చాలా మందికి డబ్బు వేగంగా కావాలి. కానీ, అందుకోసం కాస్త డేర్‌ చేయాలి. అప్పుడే డబ్బుని డబ్బు సంపాదిస్తుంది. పెట్టుబడి పెడితే రాబడి వస్తుంది. అందుకే కాస్త పెట్టుబడి పెట్టగలిగే వారి కోసం ఈ బిజినెస్‌ ఐడియా. ఇంతకీ అదేంటంటే.. ఆటోమొబైల్‌ షాపు.

ఓ రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగలిగితే దీనికి మించిన బిజినెస్‌ లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రతి ఇంట్లో రెండు మూడు బైకులు ఉంటున్నాయి. కనీసం ఒక్కటైనా ఉండనే ఉంది. చాలా మంది ప్రతి చిన్న పనికి కూడా టూ వీలర్‌ వాడటం మొదలుపెట్టారు. కాస్త దూరానికి కూడా కాలికి పని చెప్పడం లేదు. అలాగే ఆటోలు, కార్లు, ఇతర వాహనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే వాహనం అన్నాక రిపేర్‌ రావడం సహజం. అందులో కొన్ని సామన్లు చెడిపోవడం ఇంకా సహజం. ఇదే మీ బిజినెస్‌.

ఒకటి, రెండు మెకానిక్‌ షాపులు ఉన్న సెంటర్‌లో ఆటోమొబైల్‌ షాప్‌ పెట్టుకుంటే అదే షాప్‌లో ఫ్యాన్‌ కింద కూర్చోని నెలకు ఈజీగా రూ.లక్ష సంపాదించుకోవచ్చు. పైగా మెకానిక్‌ షాప్‌ నిర్వాహకులతో ముందే మాట్లాడుకొని తమ షాప్‌కు వచ్చేలా కస్టమర్లను రిఫర్‌ చేస్తే వారికి కమీషన్‌ ఇస్తామని చెప్తే ఇంకా సూపర్‌గా బిజినెస్‌ జరుగుతుంది. వ్యాపారం పెరిగే కొద్ది షాప్‌ను విస్తరిస్తూ.. వర్కర్లను పెట్టుకొని వారికి కూడా ఉపాధి మార్గం చూపించవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి