Business Idea: అతి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇచ్చే బిజినెస్‌! ఎప్పటికీ ఫుల్‌ డిమాండ్‌

తక్కువ పెట్టుబడి తో ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందవచ్చు. సరైన ప్రణాళిక, డిమాండ్‌ను బట్టి ప్రాంత ఎంపిక, తాజా సరుకు, కస్టమర్ సంబంధాలు ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి కీలకం. ఇది అధిక లాభాలు అందించే మంచి స్వయం ఉపాధి మార్గం.

Business Idea: అతి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇచ్చే బిజినెస్‌! ఎప్పటికీ ఫుల్‌ డిమాండ్‌
Indian Currency 4

Updated on: Feb 28, 2026 | 11:34 PM

పెళ్లిళ్లు, పండుగలు, దేవాలయాల డిమాండ్‌తో పూల వ్యాపారం యువతలో మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశమున్న ఈ వ్యాపారం, సరైన ప్రణాళికతో చేస్తే మంచి లాభాలను అందిస్తుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి వ్యాపారం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. చిన్న స్థాయిలో రోడ్‌సైడ్ లేదా చిన్న షాప్‌తో ప్రారంభించాలంటే సుమారు రూ.20,000 నుంచి రూ.50,000 వరకు సరిపోతుంది. ఇందులో షాప్ అద్దె అడ్వాన్స్, టేబుల్‌లు, బుట్టలు, ప్రారంభ స్టాక్ కొనుగోలు ఖర్చులు ఉంటాయి. పెద్ద స్థాయిలో హోల్‌సేల్ లేదా ఈవెంట్ డెకరేషన్ లక్ష్యంగా పెట్టుకుంటే రూ.1 లక్షకు పైగా పెట్టుబడి అవసరం కావచ్చు.

వ్యాపారం మొదలుపెట్టాలంటే ముందుగా డిమాండ్ ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయడం ముఖ్యం. దేవాలయాల దగ్గర, మార్కెట్ ప్రాంతాలు, ఫంక్షన్ హాళ్ల పరిసరాలు మంచి లొకేషన్లుగా భావిస్తారు. స్థానిక పూల రైతులతో లేదా హోల్‌సేల్ మార్కెట్‌తో నేరుగా సంబంధాలు పెంచుకుంటే తక్కువ ధరకు సరుకు పొందవచ్చు. అలాగే రోజువారీ తాజా స్టాక్ తీసుకురావడం ఈ వ్యాపారంలో విజయానికి కీలకం.

లాభాల విషయానికి వస్తే సాధారణంగా పూలపై 20 శాతం నుంచి 40 శాతం వరకు మార్జిన్ ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో రోజుకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు నికర లాభం పొందే అవకాశముంది. అయితే పూలు త్వరగా వాడిపోవడం ఈ వ్యాపారంలో ప్రధాన ప్రమాదం. అమ్మకాలు తగ్గితే నష్టాలు రావచ్చు. మొత్తంగా చూస్తే సరైన ప్రదేశం ఎంపిక, తాజా సరుకు, కస్టమర్ సంబంధాలు ఈ మూడు పాటిస్తే పూల వ్యాపారం తక్కువ పెట్టుబడితో స్థిర ఆదాయం ఇచ్చే మంచి స్వయం ఉపాధి మార్గంగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us