Business Ideas: లక్షలు సంపాదించాలనుకునే వారి కోసమే ఈ బిజినెస్! కాస్త రిస్క్ తీసుకుంటే చాలు..
హాస్టల్ వ్యాపారం అధిక లాభాలను ఆర్జించే గొప్ప అవకాశం. ముఖ్యంగా కళాశాలల సమీపంలో ఆధునిక సౌకర్యాలు, రుచికరమైన భోజనం అందిస్తే విజయం సాధించవచ్చు. దీనికి సుమారు 20 లక్షల పెట్టుబడి అవసరం. సెలవుల్లో ఆదాయం లేకపోయినా, మంచి నిర్వహణ సామర్థ్యం, ఓపిక ఉంటే ఈ బిజినెస్‌లో అద్భుతమైన సక్సెస్ పొందవచ్చు.

వ్యాపారం చేయాలనే స్ట్రాంగ్ విల్ ఉండాలే కానీ.. ఎంతటి రిస్క్ ఉన్న బిజినెస్‌లోనైనా సక్సెస్ అవ్వొచ్చు. అయితే కాన్ఫిడెన్స్‌తో పాటు ఆ బిజినెస్‌లోకి దిగే ముందే దాని గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు అలాంటి రిస్క్‌తో కూడిన బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం..
సాధారణంగా నగరాల్లోనే పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి. అందులో చదువుకునేందుకు విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారిలో చాలా మంది ఆ కాలేజీకి దగ్గరల్లోని హాస్టల్స్‌లో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో సరైన వసతులు లేకుండా ఉండే హాస్టల్స్ చాలా ఉన్నాయి. హాస్టల్ ప్రారంభించినప్పుడు ఉండే సౌకర్యాలు, భోజన వసతులు తర్వాత తర్వాత ఉండవు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలకు దగ్గర్లో హాస్టల్ నిర్వహిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
అయితే నేటి యువతరానికి తగ్గట్లు హాస్టల్‌లో సౌకర్యాలు కల్పించడంతో పాటు భోజనం కూడా శుభ్రంగా, రుచిగా అందించగలిగితే మార్కెటింగ్ అవసరం లేకుండానే ఈ బిజినెస్‌లో సూపర్ సక్సెస్ అవ్వొచ్చు. అయితే హాస్టల్ బిజినెస్ చేయడానికి పెట్టుబడి కూడా గట్టగానే అవసరం అవుతుంది. హాస్టల్ బిల్డింగ్ రెంట్, ప్రతి రూమ్‌లో ఫ్యాన్లు, లైట్లు, బెడ్లు, కిచన్ సెటప్, వంట వాళ్లు ఇలా ఓ రూ.20 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. అలాగే కాలేజీలకు సెలవులు ఉన్నప్పుడు కూడా ఆదాయం ఉండదు. వీటిని భరించగలిగి, ఓ 100 మంది ఉన్న కుటుంబాన్ని నడిపించేంత ఓపిక ఉంటే మాత్రం హాస్టల్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




