Royal Enfield Guerrilla 450: బుల్లెట్ బండికి స్పోర్టీ లుక్.. నయా బైక్ రిలీజ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అన్ని ఇంచుమించు ఒకే డిజైన్‌తో వస్తాయి. అయితే ఈ బైక్స్ అంటే వయస్సుతో సంబంధం లేకుండా అంతా ఇష్టపడుతూ ఉంటారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే చందానే రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా స్పోర్టీ లుక్‌తో గెరిల్లా 450 బైక్‌ను లాంచ్ చేసింది. రోడ్‌స్టర్ మోటార్ సైకిళ్ల విభాగంలో మొట్టమొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా గెరిల్లా 450 నిలిచింది. ఈ బైక్ షెర్పా 450 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పని చేస్తుంది.

Royal Enfield Guerrilla 450: బుల్లెట్ బండికి స్పోర్టీ లుక్.. నయా బైక్ రిలీజ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
Royal Enfield Guerrilla 450
Follow us

|

Updated on: Jul 19, 2024 | 3:39 PM

భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు బుల్లెట్ బండి అనే ముద్దుపేరు ఉంది. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అన్ని ఇంచుమించు ఒకే డిజైన్‌తో వస్తాయి. అయితే ఈ బైక్స్ అంటే వయస్సుతో సంబంధం లేకుండా అంతా ఇష్టపడుతూ ఉంటారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే చందానే రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా స్పోర్టీ లుక్‌తో గెరిల్లా 450 బైక్‌ను లాంచ్ చేసింది. రోడ్‌స్టర్ మోటార్ సైకిళ్ల విభాగంలో మొట్టమొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా గెరిల్లా 450 నిలిచింది. ఈ బైక్ షెర్పా 450 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ బైక్ ధర రూ.2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 అనేక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ పట్టణాల్లో రోజువారీ ప్రయాణించే వారికి మంచి ఎంపిక అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 మూడు వేరియంట్లలో ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఫ్లాష్, డాష్, అనలాగ్ వేరియంట్స్‌లో ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. అనలాగ్ వేరియంట్ డిజి-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. దాని చుట్టూ అనలాగ్ డయల్‌తో మధ్యలో ఎల్‌సీడీ డిస్ ప్లేతో వస్తుంది. అనలాగ్ గెరిల్లా 450 బేస్ వేరియంట్ ధర రూ.2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) అనలాగ్ వేరియంట్ స్మోక్ సిల్వర్ కలర్ వేలో లేదా ప్లేయా బ్లాక్లో అందుబాటులో ఉంది.

ప్లేయా బ్లాక్ కలర్‌తో డాష్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. డాష్ వేరియంట్ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్- షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ మిడ్-ఎండ్ స్పెక్, ప్రీమియం ఫ్లాష్ స్పెక్‌తో పాటు 4 అంగుళాల రౌండ్ ట్రిప్పర్ టీఎఫ్‌టీ క్లస్టర్‌తో వస్తుంది. ఈ క్లస్టర్ గూగుల్ మ్యాప్స్‌తో స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ఫీచర్‌తో వస్తుంది. ఫ్లాష్ గెరిల్లా 450కు సంబంధించిన అత్యధిక స్పెక్ వేరియంట్ రెండు రంగు ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. బ్రావా బ్లూ, ఎల్లో రిబ్బన్. ఫ్లాష్ వేరియంట్ ధర రూ.2.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారభం అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 అనేది షెర్పా 450 ప్లాట్ఫారమ్ పై ఆధారపడి పని చేస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 షెర్పా 450 ఇంజిన్ పై ఆధారపడి ఉంటుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్‌తో కూడిన లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ 452 సీసీ యూనిట్‌తో పని చేస్తుంది. ఈ బైక్ 39.47 బీహెచ్‌పీ, 40 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బుల్లెట్ బండికి స్పోర్టీ లుక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఫీచర్స్ ఇవే
బుల్లెట్ బండికి స్పోర్టీ లుక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఫీచర్స్ ఇవే
నాలుగేళ్లకే ముక్కలైన పాండ్యా కుటుంబం
నాలుగేళ్లకే ముక్కలైన పాండ్యా కుటుంబం
పాములకు ఇది లక్ష్మణరేఖ.. ఇంటి చుట్టూ చల్లితే విషసర్పాలు పరార్
పాములకు ఇది లక్ష్మణరేఖ.. ఇంటి చుట్టూ చల్లితే విషసర్పాలు పరార్
మీక్కూడా ఇలాగే ఉందా.? అయితే మీరు నోమోఫోబియాతో బాధపడుతున్నట్లే..
మీక్కూడా ఇలాగే ఉందా.? అయితే మీరు నోమోఫోబియాతో బాధపడుతున్నట్లే..
చిన్న వయసులోనే మృతిచెందిన నిర్మాత కూతురు..
చిన్న వయసులోనే మృతిచెందిన నిర్మాత కూతురు..
మైక్రోసాఫ్ట్‌తో సంప్రదించాం.. సర్వర్ల అంతరాయంపై కేంద్ర మంత్రి
మైక్రోసాఫ్ట్‌తో సంప్రదించాం.. సర్వర్ల అంతరాయంపై కేంద్ర మంత్రి
మీ ల్యాప్‌టాప్‌లో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇలా చేయండి..
మీ ల్యాప్‌టాప్‌లో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇలా చేయండి..
రచ్చ షురూ.? కల్కి vs యానిమల్.. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్‌.
రచ్చ షురూ.? కల్కి vs యానిమల్.. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్‌.
అలర్ట్.. తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
అలర్ట్.. తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
ప్రమాదంలో ఆ ముగ్గురి వన్డే కెరీర్‌.. బిగ్ షాకిచ్చిన గంభీర్
ప్రమాదంలో ఆ ముగ్గురి వన్డే కెరీర్‌.. బిగ్ షాకిచ్చిన గంభీర్