
Gold Loans: బంగారు రుణాలు. ఇవి అత్యవస సమయాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పెద్దగా డాక్యుమెంటేషన్ లేకుండా, కొన్ని నిమిషాల్లోనే బంగారంపై రుణం తీసుకోవచ్చు. అందుకే చాలా మంది ఈ రుణాలపై ఆసక్తి చూపుతుంటారు. దీనికి సిబిల్ స్కోర్ అవసరం లేదు.. ఇతరుల ష్యూరిటీ అవసరం లేదు. ఇతర బ్యాంకు రుణాలకు అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. చివరకు అది మంజూరు అవుతుందా? లేదా అనేది తెలియదు. అదే బంగారంపై రుణాలకు చాలా తక్కువ ప్రాసెస్‌లో తక్కువ సమయంలోనే రుణం పొందవచ్చు. చాలా కుటుంబాల్లో రుణం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బంగారంపై రుణం.
మిగతా రుణాలతో పోల్చుకుంటే గోల్డ్ లోన్ రావడం చాలా సులభంగా ఉంటుంది. దీనికి ఎక్కువగా పత్రాలు అవసరం ఉండవు. ఈ రుణాల్లో తెలంగాణ, ఏపీ వాటా కూడా ఎక్కువే ఉందని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా బంగారంపైనే రుణాలు తీసుకుంటున్నారట.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం బంగారు రుణాలు రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు మార్కెట్‌లో 76.55 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ బంగారు రుణ మార్కెట్‌లో దక్షిణాది రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Alcohol: ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్ 1.. తెలంగాణ ఏ స్థానంలో ఉందో తెలిస్తే షాకవుతారు!
ఇక రూ.14.5 లక్షల కోట్లలో టాప్ 10 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్రమే బంగారం రుణాలు తీసుకున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో 3.63 కోట్ల మంది వినియోగదారులు రూ.6 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను పొందారు. ఇది గత సంవత్సరం కంటే రుణ విలువలో 53 శాతం వృద్ధిని, కస్టమర్ బేస్‌లో 16 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
తమిళనాడు: 4.9 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్: 3.4, కర్ణాటక: 1.4 లక్షల కోట్ల రుణాలతో టాప్ 3లో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ ఉన్నాయి. కనీస డాక్యుమెంటేషన్, సౌకర్యవంతమైన షరతులను అందిస్తున్నందున ఈ బంగారం రుణాలపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
ఇది కూడా చదవండి: Tech Tips: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి.. కొన్ని సెకన్లలోనే బ్లాక్ అవుతుంది.. ఎవ్వరు ఉపయోగించలేరు!
ఇది కూడా చదవండి: IndiGo: ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి