Google Duo Stop Working: ఆ ఫోన్లలో గూగుల్ డ్యూయో సేవలు బంద్.. కారణాలు ఇలా ఉన్నాయి..

|

Jan 25, 2021 | 11:56 PM

Google Duo Stop Working: వీడియోకాలింగ్‌ యాప్‌ గూగుల్ డ్యుయో సేవలు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నిలిచిపోనున్నాయి. గూగుల్‌ సర్టిఫై చెయ్యని

Google Duo Stop Working:  ఆ ఫోన్లలో గూగుల్ డ్యూయో సేవలు బంద్.. కారణాలు ఇలా ఉన్నాయి..
Follow us on

Google Duo Stop Working: వీడియోకాలింగ్‌ యాప్‌ గూగుల్ డ్యుయో సేవలు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నిలిచిపోనున్నాయి. గూగుల్‌ సర్టిఫై చెయ్యని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ పనిచేయ్యదని తెలుస్తోంది. ప్లే సర్వీసెస్‌ కోసం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేస్తుంది. దాని వల్ల గూగుల్ సూట్‌లోని అన్ని రకాల సేవలు ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌గా సదరు ఫోన్లలోకి వస్తాయి. ఒక వేళ ఏవైనా ఫోన్లకు గూగుల్ యాప్స్‌కు సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వకుంటే వాటిలో సదరు ఈ యాప్స్‌ పనిచేయవు. గతంలో ఇలానే కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ మెస్సేజెస్‌ సేవలు ఆగిపోయాయి. ఇదే తరహాలో తాజాగా గూగుల్ డ్యుయో సేవలు నిలిచపోనున్నాయి.

గూగుల్ డ్యుయో సేవలు నిలిచిపోయే ఫోన్లలో యాప్‌ ఓపెన్ చేసిన వెంటనే ‘త్వరలో డ్యుయో ఆగిపోతుంది. ఎందుకంటే మీరు ధృవీకరించని డివైజ్‌ ఉపయోగిస్తున్నారు. మీ ఖాతాను ఈ డివైజ్‌ నుంచి తొలగించడం జరుగుతుంది’ అనే మెస్సేజ్ కనిపిస్తుంది. ఒక వేళ మీ ఫోన్లలో అలాంటి మెస్సేజ్‌ కనిపిస్తే మార్చి 31లోపు డ్యుయో ఖాతాలోని మీ కాల్‌ హిస్టరీ, వీడియో క్లిప్స్‌ అందులోంచి మరోచోట స్టోర్ చేసుకోవడం మంచిది. లేదంటే ఖాతాతో పాటు వాటిని కూడా మీరు కోల్పోయే అవకాశం ఉంది.

వినియోగదారులకు గూగుల్‌ పే షాకింగ్‌ న్యూస్‌.. నిలిచిపోనున్న వెబ్‌ యాప్ సేవలు.. అంతేకాదు..!