AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: ఒక్క ఫ్లాట్‌తో రూ. 3.10 కోట్లు సంపాదించిన సోనూసూద్.. ఎలా అంటే..?

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆస్తుల ధరలు వేగంగా పెరిగాయి. ముఖ్యంగా మహాలక్ష్మి ప్రాంతంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయిన లోఖండ్‌వాలా మినర్వాలో సోను సూద్‌కు ఒక ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్ అమ్మకంతో ఆయన భారీ లాభాలు అర్జించారు.

Sonu Sood: ఒక్క ఫ్లాట్‌తో రూ. 3.10 కోట్లు సంపాదించిన సోనూసూద్.. ఎలా అంటే..?
Sonu Sood Earns Rs 3.10 Crore Profit
Krishna S
|

Updated on: Aug 29, 2025 | 11:28 AM

Share

రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆపదలో ఉన్న ఎంతోమందికి ఆయన అండగా నిలిచారు. అయితే సోనూ సూద్ సినిమాల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు సంపాదిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయం చేసి హీరోగా మారిన సోనూ సూద్, ఇప్పుడు వ్యాపారంలోనూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం బాలీవుడ్ ప్రముఖులకు కొత్త ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో సోనూ సూద్ కూడా అదే బాటలో నడిచి ఒకే ఫ్లాట్‌పై ఏకంగా రూ.3.10 కోట్లు లాభం పొందారు.

కొత్త ఆదాయ వనరు

ముంబై.. దేశ ఆర్థిక రాజధానిగా, ఆస్తి ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్న నగరంగా మారింది. ముఖ్యంగా ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విలువలు చాలా వేగంగా పెరిగాయి. ఈ ప్రాంతంలోని ‘లోఖండ్‌వాలా మినర్వా’ అనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో సోనూ సూద్‌కు ఒక ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను ఆయన ఇటీవలే రూ. 8.10 కోట్లకు విక్రయించారు. ఈ ఫ్లాట్‌ను సోనూ సూద్ దాదాపు రూ. 5 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా సోనూ సూద్ రూ. 3.10 కోట్లు లాభం సంపాదించారు.

మహాలక్ష్మి ప్రాంతం ముంబైలోని నారిమన్ పాయింట్, వర్లి, లోయర్ పరేల్ వంటి ప్రధాన వ్యాపార కేంద్రాలకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ప్రాంతంలోని ఆస్తులకు నివాసితులు మరియు వ్యాపారులు ఇద్దరి నుండి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ఫ్లాట్ వివరాలు

సోనూ సూద్ విక్రయించిన ఫ్లాట్ ‘లోఖండ్‌వాలా మినర్వా’లో 1,247 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, అలాగే 1,497 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా కలిగి ఉంది. ఈ ఫ్లాట్‌తో పాటు రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఆగస్టు 2025లో ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ లావాదేవీ ద్వారా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద దాదాపు రూ.48.60 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.30,000 ఆదాయం వచ్చింది.

బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఊర్వశి రౌతేలా వంటి వారు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సోనూ సూద్ పేరు కూడా చేరింది. సినిమాలతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి తెలివిగా సంపాదించడం ద్వారా సోనూ సూద్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా తనదైన ముద్ర వేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..