Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar System Project: సోలార్ రూఫ్‌టాప్ పథకం అంటే ఏమిటి? కేంద్ర నుంచి భారీ సబ్సిడీ

వేసవి కాలం త్వరలో ప్రారంభం కానుంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లతోపాటు అనేక రకాల భారీ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగింది. దీని వల్ల ఇంటి విద్యుత్ ఖర్చు..

Solar System Project: సోలార్ రూఫ్‌టాప్ పథకం అంటే ఏమిటి? కేంద్ర నుంచి భారీ సబ్సిడీ
Solar System Project
Follow us
Subhash Goud

|

Updated on: Feb 13, 2023 | 6:00 AM

వేసవి కాలం త్వరలో ప్రారంభం కానుంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లతోపాటు అనేక రకాల భారీ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగింది. దీని వల్ల ఇంటి విద్యుత్ ఖర్చు కూడా పెరుగుతుంది. యూనిట్‌పై ఆధారపడి అనేక సార్లు విద్యుత్ బిల్లు మీ బడ్జెట్‌కు మించి పోతుంది. అటువంటి పరిస్థితిలో విద్యుత్ బిల్లుకు సంబంధించి మీ ముందు ఒక సమస్య తలెత్తుతుంది. దీని నివారణ సోలార్ ఎనర్జీ. అంటే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చి విద్యుత్తును వినియోగించుకుంటే మీ బిల్లు స్వల్పంగానే ఉంటుంది. దీనితో పాటు ప్రభుత్వం కూడా ఈ పనిలో మీకు సహాయం చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మీకు ఏవిధంగా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

సోలార్ రూఫ్‌టాప్ పథకం అంటే ఏమిటి?

దేశంలో సౌరశక్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సోలార్ రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో డిస్కమ్ ప్యానెల్‌లో చేర్చబడిన ఏదైనా విక్రేత నుండి మీరు ఇంటి పైకప్పుపై సోలార్ పీనల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకోవచ్చు.దీని కోసం మీరు దరఖాస్తు చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు.

20 శాతం సబ్సిడీ

ఉదాహరణకు మీరు 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను అమర్చినట్లయితే, దాని ధర సుమారు 70-75 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం నుంచి 20 శాతం సబ్సిడీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

సబ్సిడీ విధానం ఎలా..?

మీ ఇంటికి రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్ అమర్చుకుంటే రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన తర్వాత కేవలం 72 వేల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 500 కెవి వరకు సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుపై ప్రభుత్వం నుండి 20 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.

25 ఏళ్లపాటు ప్రయోజనాలు పొందారు

మీరు సోలార్ రూఫ్‌టాప్ ప్లాన్‌లో 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించవచ్చు. ఈ పథకంలో ఖర్చు చెల్లింపును 5 నుండి 6 సంవత్సరాలలో పూర్తిగా రికవరీ చేయవచ్చు. ఈ పథకం ద్వారా, కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ విషయంలో మోడీ ప్రభుత్వం చాలా వేగంగా పని చేస్తోంది. ఫిబ్రవరిలో సమర్పించిన సాధారణ బడ్జెట్2023 లో సౌరశక్తికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది.

ఈ పత్రాలను కలిగి ఉండాలి

సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీ వద్ద కొన్ని పత్రాలు ఉండాలి. ఉదాహరణకు 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ కోసం దాదాపు 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. మీరు తప్పనిసరిగా శాశ్వత నివాస కార్డును కలిగి ఉండాలి. అంటే ఆధార్ కార్డు, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ ఏదైనా ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు, విద్యుత్ బిల్లు డిపాజిట్ రసీదు. సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయనున్న పైకప్పు ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి