Lava Blaze 5G : కేవలం రూ. 11, 499కే 5జీ ఫోన్.. ఒక టీబీ వరకూ స్టోరేజీ సామర్థ్యం..

లావా తన కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ వేరియంట్ ఫోన్లలోకెల్లా అత్యంత చవకైనదిగా దీనిని ఆవిష్కరించింది.

Lava Blaze 5G : కేవలం రూ. 11, 499కే 5జీ ఫోన్.. ఒక టీబీ వరకూ స్టోరేజీ సామర్థ్యం..
Lava Blaze 5g
Follow us

|

Updated on: Feb 12, 2023 | 3:45 PM

భారతీయ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా తన కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ వేరియంట్ ఫోన్లలోకెల్లా అత్యంత చవకైనదిగా దీనిని ఆవిష్కరించింది. లావా బ్లేజ్ 5జీ పేరిట మార్కెట్లోకి లాంచ్ చేసింది.  6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఉన్న ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాలిడ్ లుక్ లో ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

 స్పెసిఫికేషన్లు..

చవకైన రేంజ్ లో లభించే ఈ 5జీ ఫోన్ గురించిన వివరాలు లావా కంపెనీ గత ఏడాదిలోనే ప్రకటించింది. అందుకనుగుణంగా దీనిని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా బ్లేజ్​ 5జీ, 6జీబీ ర్యామ్​ వేరియంట్​.. మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న మోడల్​ను పోలి ఉంటుంది. ఇందులో 6.5 ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ డిస్​ప్లే విత్​ 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉంది. వాటర్​ డ్రాప్​- నాచ్​, ఫ్లాట్​ ఎడ్జ్​ డిజైన్ ​దీని సొంతం. ఈ లావా బ్లేజ్​ 5జీ కొత్త వేరియంట్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 700 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. ఆక్టా-కోర్​ ప్రాసెసర్​ కూడా ఉంది. 2.2 జీహెచ్​జెడ్​, ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ మెమోరీ, యూఎఫ్​ఎస్​ 2.2 స్టోరేజ్​ వంటివి ఉన్నాయి. కొత్త వేరియంట్​లో మెమొరీ కార్డ్​ స్లాట్​ కూడా ఉండటం విశేషం. 1టీబీ వరకు స్టోరేజ్​ను ఎక్స్​పాండ్​ చేసుకోవచ్చు. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

ఫీచర్లు ఇలా..

ఆండ్రాయిడ్​ 12 ఓస్​పై ఈ లావా బ్లేజ్​ 5జీ కొత్త వేరియంట్​ పనిచేస్తుంది. ఎనానిమస్​ కాల్​ రికార్డింగ్​ ఫీచర్​ కూడా ఉండటం మరింత ప్రత్యేకం. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ సైతం ఉంది. కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. 2కే వీడియో రికార్డింగ్​ కూడా ఉంది. సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరాని ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే..

లావా బ్లేజ్​ 5జీ వేరియంట్ 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ సామర్థ్యంతో ఉన్న ఫోన్​ ధర రూ. 11,999గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద రూ. 11,499కే ఈ స్మార్ట్​ఫోన్​ను విక్రయిస్తోంది లావా సంస్థ. ఇందులో గ్లాస్​ బ్లాక్​ డిజైన్​ ఉంటుంది. గ్లాస్​ బ్లూ, గ్లాస్​ గ్రీన్​ కలర్స్​లోనూ ఇది అందుబాటులో ఉంది. సంస్థ అధికారిక వెబ్​సైట్​తో పాటు అమెజాన్​లోనూ ఈ మొబైల్​ను కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్