Gold Silver Investment: గోల్డ్ ఈటీఎఫ్ స్కీంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

గత కొన్ని సంవత్సరాలుగా పసిడి ధర బాగా పెరిగింది. తక్కువ ఆదాయం ఉన్నవారికి బంగారం ఒక కలగా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో రూ.10,000- రూ.20,000 సంపాదించే వారు కూడా బంగారం కొనుగోలు చేసి భవిష్యత్తులో సంపదను పెంచుకునే అవకాశం ఉంది. అది గోల్డ్ ETF (గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్). గోల్డ్ ETF అనేది షేర్ల మాదిరిగానే స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ అయ్యే పెట్టుబడి నిధి.

Gold Silver Investment: గోల్డ్ ఈటీఎఫ్ స్కీంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Gold Etf Scheme

Updated on: Dec 17, 2025 | 6:05 PM

బంగారం భగ్గుమంటోంది.. తులం బంగారం ధర లక్షన్నర చేరువకు చేరుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా పసిడి ధర బాగా పెరిగింది. తక్కువ ఆదాయం ఉన్నవారికి బంగారం ఒక కలగా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో రూ.10,000- రూ.20,000 సంపాదించే వారు కూడా బంగారం కొనుగోలు చేసి భవిష్యత్తులో సంపదను పెంచుకునే అవకాశం ఉంది. అది గోల్డ్ ETF (గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్). గోల్డ్ ETF అనేది షేర్ల మాదిరిగానే స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ అయ్యే పెట్టుబడి నిధి. ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండటం వల్ల ఇది మీకు భద్రతను అందిస్తుంది. ఇది భౌతిక బంగారం కంటే ఎక్కువ ద్రవంగా ఉంటుంది. దీని వలన వ్యాపారం చేయడం, కొనుగోలు చేయడం సులభం అవుతుంది. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే…

గోల్డ్ ఈటీఎఫ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా డీమాట్ ఖాతా తెలియాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్లో షేర్ల తరహాలో ఇందులో గోల్డ్ యూనిట్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. విశ్వసనీయ బ్రోకర్ లేదా ఒక బ్రోకింగ్ యాప్ ద్వారా గోల్డ్ ETF స్కీంను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ ETFల ఖర్చు, అలాగే రాబడి నిష్పత్తిని పోల్చి చూసుకున్న తర్వాత మీకు ఏది సరైనదో ఎంచుకోవాల్సి ఉంటుంది. వీలైతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుంటే మంచిది. బంగారం మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్న సమయంలో గోల్డ్ యూనిట్లను దశలవారీగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులను ఒకే సారి పెట్టుబడిగా అంటే లంప్‌సమ్ కంటే SIP ద్వారా కొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీ డీమ్యాట్ అకౌంట్‌తో బ్యాంక్ ఖాతా, KYC పూర్తి చేసిన అనంతరం పెట్టుబడి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. గోల్డ్ ETFలు 99.5శాతం శుద్ధి గోల్డ్‌ పైన పెట్టుబడి పెడతాయి. ప్రపంచ గోల్డ్ మార్కెట్ ధర ఆధారంగా కదలికలు ఉంటాయి. మీ పెట్టుబడి ప్రభావితం అవుతుంది. గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు తర్వాత డీమాట్ ఖాతాలో గోల్డ్ యూనిట్స్ వెంటనే జమ అవడం ప్రారంభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ వివరాలు ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు టీవీ 9 తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. ఈ విషయాన్ని గుర్తించుకోగలిగారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి