
దసరా, దీపావళి ఇలా రెండు పెద్ద పండుగలు ఒకే నెలలో రావడంతో పెద్ద ఎత్తున వస్తువులను కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ-కామర్స్ సైట్లు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడంతో ఏడాదంతా ఎదురు చూస్తున్న వాళ్లు ఈ సీజన్‌లోనే వస్తువులు కొనుగోలు చేశారు. అయితే సహజంగా షాపింగ్ చేసిన వారిలో ఎక్కువగా పెద్ద పెద్ద పట్టణాలకు చేసిన వారుంటారని అనుకుంటాం. కానీ దీనికి భిన్నంగా చిన్న నగరాల్లోనే ఎక్కువ షాపింగ్ జరిగిందని ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన అమ్మకాల్లో దాదాపు 60 శాతం వాటాను చిన్న నగరాలే దక్కించుకున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
దీని విలువ అక్షరాల రూ. 24,000 వేల కోట్లుగా తేలింది. ఇదిలా ఉంటే ఉంటే గతేడాది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై మొత్తం అమ్మకాల్లో 50 శాతంతో టైర్ 2 పట్టణాలు మెట్రో, టైర్ 1 నగరాలతో సమానంగా అమ్మకాలను సాధించాయి. ఈఏడాది ఈ కామర్స్ సంస్థలు 27 శాతం వృద్ధితో రూ. 40,000 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేశాయి. ఈ మొత్తం ఒక్క ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ 62 శాతం వాటాను కలిగి ఉండడం విశేషం.
టైర్ 2 నగరాల్లో ఎక్కువగా షాపింగ్ చేవాశారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో, జియోమార్ట్ వంటి కంపెనీల్లో జరిగిన విక్రయాల్లో టైర్ 2 నగరానికి చెందిన వారే చేయడం విశేషం. ఇక ప్రొడక్ట్ కంపెనీలు సైతం 50 శాతం కంటే ఎక్కువ మంది రెండు రెట్ల అమ్మకాల వృద్ధిని సాధించారని రెడ్‌సీర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ధరల తగ్గింపు, ప్రమోషన్స్, డిస్కౌంట్‌లతో ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఇన్‌స్టాలేషన్‌లు కూడా 3 రెట్లు పెరిగాయని రెడ్‌సీర్ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..