ఏంటీ.. కేవలం ప్రతి నెలా రూ.2 వేల పెట్టుబడితో లక్షాధికారి అవ్వొచ్చా? చాలా మంది కలని నిజం చేసే ఫార్ములా..

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి సులభమే కానీ సరైన ఫండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. నెలకు రూ.2000 SIP తో, క్రమశిక్షణతో టాప్-అప్ SIP వ్యూహంతో 30 ఏళ్ళలో రూ.1.59 కోట్ల పెద్ద నిధిని సృష్టించవచ్చు. చక్రవడ్డీ ప్రయోజనంతో సంపదను పెంచుకోవడానికి గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి.

ఏంటీ.. కేవలం ప్రతి నెలా రూ.2 వేల పెట్టుబడితో లక్షాధికారి అవ్వొచ్చా? చాలా మంది కలని నిజం చేసే ఫార్ములా..
Indian Currency 2

Updated on: Nov 06, 2025 | 7:30 AM

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు చాలా సులభం అయింది. మ్యూచువల్ ఫండ్లు ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడిదారులను ధనవంతులుగా చేశాయని దీని అర్థం కాదు. కొన్ని ఫండ్లు పెట్టుబడిదారులను ఒక ఉచ్చులోకి నెట్టాయి. అవి ప్రతికూల రాబడిని ఇచ్చాయి. అందువల్ల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఏదైనా ఫండ్‌లో గుడ్డిగా పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉండదు.

SIP చేస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎంపిక నిజంగా ముఖ్యమా? అంటే కచ్చితంగా ముఖ్యమే. మీరు SIP చేసే ముందు మ్యూచువల్ ఫండ్ నిబంధనలు, షరతులను చదవాలి. గత కొన్ని సంవత్సరాలలో ఈ ఫండ్ పనితీరు, రాబడి గణన, దాని భవిష్యత్తు పథాన్ని అంచనా వేయడం కూడా అవసరం. పెట్టుబడిదారుడు నెలకు రూ.500 పెట్టుబడి పెడుతుంటే, ఇది చాలా తక్కువ మొత్తం అవుతుంది. దీని నుండి వచ్చే రాబడి. ఇది పెద్దగా ఉండదు. బదులుగా నెలకు రూ.2000 పెట్టుబడి పెట్టడం అవసరం. మీరు సరైన వ్యూహాన్ని ఉపయోగించినట్లయితే, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తే, మీరు ఈ రెండు వేల రూపాయలతో పెద్ద మొత్తంతో రాబడి పొందవచ్చు.

నెలవారీ రూ.2000 SIP ద్వారా రూ.1.59 కోట్ల నిధిని సృష్టించవచ్చు. వరుసగా 30 సంవత్సరాలు ఒక్క SIP కూడా మిస్ అవ్వకుండా SIP ని కొనసాగిస్తే, ఈ కాలంలో అతను దాని నుండి ఒక్క మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోకపోతే, లక్షాధికారి కావాలనే కల నెరవేరుతుంది. మీరు ప్రతి సంవత్సరం పెట్టుబడి 10 శాతం పెంచుకుంటే పోతే ఊహించిన దానికంటే పెద్ద నిధి సృష్టించబడుతుంది.

టాప్-అప్ SIP అంటే ఏమిటి?

టాప్-అప్ SIPలో నెలవారీ SIP మొత్తాన్ని ప్రతి సంవత్సరం 10 శాతం పెంచాలి. అలాంటప్పుడు మీరు 30 సంవత్సరాల పాటు రూ.2000 టాప్-అప్ SIP ని కొనసాగిస్తే, మీరు మొత్తం రూ.39.47 లక్షలు పెట్టుబడి పెడతారు. 30 సంవత్సరాల తర్వాత మీకు మొత్తం రూ.1.59 కోట్లు లభిస్తాయి. ఇందులో కేవలం రూ.1.20 కోట్ల రాబడి మాత్రమే ఉంటుంది. పెట్టుబడిదారుడికి చక్రవడ్డీ ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి పొదుపుపై ​​వడ్డీ, దానిపై వడ్డీ చక్రం నిరంతరం కొనసాగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి