వెండి విక్రయించే రేటు కూడా యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే, భారతదేశంలో వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే ప్రస్తుతం భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి ప్రత్యేక స్థానముంది. మహిళలు, బంగారంతో పాటు వెండి నగలు కూడా ధరిస్తుంటారు. ఇక వివిధ పూజా కార్యక్రమాల్లో వెండితే తయారు చేసిన వస్తువులను సైతం బాగానే వాడుతుంటారు. వెండితో తయారు చేసిన వస్తువులను ఎక్కువ పూజలో వాడుతుంటారు. వివిధ విగ్రహాలు సైతం తయారు చేస్తుంటారు. అయితే అంతర్జాతీయ ధరలను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. అయితే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండికి ఎంతో డిమాండ్ ఉంటుంది. షాపులన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఏ మాత్రం తగ్గవు. ప్రతి రోజు కోట్లల్లో బిజినెస్ జరుగుతుంటుంది. అయితే వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల మార్పుల కారణంగా ప్రతి రోజు ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంటాయి. ఇక వెండి ప్రస్తుతం వెండి ధర రూ.76 వేల వరకు ఉంది.1981లో వెండి ధరను పరిశీలిస్తే కిలోకు రూ.2715 మాత్రమే ఉంది. మరి అంత తక్కువగా ఉన్న వెండి ధర ప్రస్తుతం పరుగులు పెట్టింది. బ్యాంకు బజార్ వివరాల ప్రకారం.. 1981 నుంచి ప్రస్తుతం 2023 ఆగస్టు 26 వరకు వెండి కిలోకు ఏయే ధర ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి