Silver Price Today: బంగారం బాటలో వెండి.. పెరిగిన సిల్వర్‌ ధర.. తాజా రేట్ల వివరాలు

|

Dec 12, 2021 | 5:13 AM

Silver Price Today: ఒక వైపు బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. మరో వైపు వెండి ధర కిలోకు రూ.500లకుపైగా పెరిగింది. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు ప్రాధాన్యత..

Silver Price Today: బంగారం బాటలో వెండి.. పెరిగిన సిల్వర్‌ ధర.. తాజా రేట్ల వివరాలు
Follow us on

Silver Price Today: ఒక వైపు బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. మరో వైపు వెండి ధర కిలోకు రూ.500లకుపైగా పెరిగింది. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఆదివారం (డిసెంబర్‌ 12)న వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, కోల్‌కతాలో రూ.61,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,200 ఉండగా, కేరళలో రూ.65,100 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా, విజయవాడలో రూ.65,100 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ 10 ఫైనాన్స్‌ కంపెనీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?

ప్రయాణికుల కోసం అక్కడి రైల్వే స్టేషన్‌లో ఆ సేవలు ప్రారంభం.. సమయం ఆదా.. ఛార్జీలు తక్కువే..