SilverPrice Today: వెండి కొనుగోలు చేసేవారికి షాక్‌.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు

|

May 08, 2021 | 7:18 AM

SilverPrice Today: దేశంలో బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గత నెలలో తగ్గుముఖం పట్టిన వెండి ధర.. తాజాగా భారీగా పెరిగింది. తాజాగా శనివారం కిలో వెండి ధర..

SilverPrice Today: వెండి కొనుగోలు చేసేవారికి షాక్‌.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు
Silver Price
Follow us on

SilverPrice Today: దేశంలో బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గత నెలలో తగ్గుముఖం పట్టిన వెండి ధర.. తాజాగా భారీగా పెరిగింది. తాజాగా శనివారం కిలో వెండి ధరపై 1700 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. కిలో వెండి ధర రూ.71,600 ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, ముంబైలో 71,600 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, కోల్‌కతాలో రూ.71,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, కేరళలో రూ.71.600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విజయవాడలో రూ.76,100 ఉంది.

అయితే భారతీయులు బంగారం, వెండికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. రోజువారీగా వెండి కొనుగోళ్లు సాధారణంగా జరిగినా.. పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు సిల్వర్‌ కొనుగోలు భారీగా జరుగుతుంటాయి. అయితే దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కస్టమర్లు కొనుగోలు చేసే ముందు ధరలను చూసుకొని వెళ్లడం మంచిది.

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!