Silver Rate Today: దేశంలో వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. వెండి కూడా ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. గత 14 రోజుల్లో వెండి ధర కిలోకు రూ.4,600 వరకు పెరిగింది. బుధవారం కిలో వెండి ధరపై స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, తాజాగా గురువారం మాత్రం వెండి ధర భారీగానే పెరిగింది. అంటే అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో కిలో వెండి ధరపై ఏకంగా, రూ.1300 వరకు పెరుగగా, అయితే ఈనెలలో ఓవరాల్‌గా పరిశీలిస్తే వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 6 నెలల కిందట అంటే అక్టోబర్ 14వ తేదీన కిలో వెండి ధర రూ.62,000 ఉండగా, ఇప్పుడు రూ.71,900 ఉంది. అంటే రూ.9,900 పెరిగినట్లయింది. దీనిని బట్టి చూస్తే బంగారం బాటలోనే వెండి కూడా దూసుకెళ్తోంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.67,600 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో కిలో వెండి రూ.67,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది.
ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, విజయవాడలో రూ.71,900, ఇక విశాఖలో కిలో వెండి ధర రూ.71,900 ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా ఒకే విధంగా ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పెరుగుదల, తగ్గుదల నమోదవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉంటున్నాయి.
ఇవీ కూడా చదవండి: Gold Loan: బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి