Silver Price Today: శనివారం వినియోగదారులకు ఊరట కలిగించేలా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అయితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. శుక్రవారం వెండి ధరలో కాస్త పెరుగుదల కనిపించినప్పటికీ మళ్లీ వెంటనే శనివారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో శనివారం కిలో వెండి ఎంత పలుకుతుందో ఓసారి చూడండి.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర శుక్రవారంతో పోలిస్తే రూ. 1200 తగ్గి.. రూ. 70,800 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండి ధర రూ. 70,800 (శుక్రవారం రూ.72,000 ) గా ఉంది.
* దక్షిణ భారతదేశంలో ప్రధాన పట్టణాల్లో ఒకటైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500 (శుక్రవారం రూ. 77,500 )గా ఉంది.
* బెంగళూరులో శనివారం కిలో వెండి ధర రూ. 70,800 (శుక్రవారం రూ. 72,000) పలికింది.
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర శుక్రవారంతో పోలిస్తే తగ్గుదల కనిపించింది. ఇక్కడ శనివారం కిలో రూ. 75,500 (శుక్రవారం రూ. 77,500 )గా ఉంది.
* విజయవాడలో కిలో వెండి ధర రూ. 75,500 (శుక్రవారం రూ. 77,500) వద్ద కొనసాగుతోంది.
* సాగగతీరం విశాఖలో కిలో వెండి ధర రూ. 75,500 (శుక్రవారం రూ. 77,500) గా ఉంది.
Also Read: Gold Price Today: బంగారం వినియోగదారులకు భారీ ఊరట.. తులం బంగారంపై ఎంత ధర తగ్గిందో తెలుసా..?
Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న న్యూస్.. సర్కారు వారి పాటలో..