
Gold, Silver: 2026 ఫిబ్రవరి చివరలో పశ్చిమ ఆసియాలో మొదలైన యుద్ధ మేఘాలు బంగారం, వెండి ధరలను తీవ్రమైన ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి. జనవరి 29, 2026న వెండి ధర కిలోకు రికార్డు స్థాయిలో రూ.4,20,048 తాకగా, బంగారం 10 గ్రాములు రూ.1,80,779 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. అయితే, ఆ తర్వాత ధరలు భారీగా పతనమవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్టంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ డైమండ్స్ వ్యవస్థాపకుడు సుమిత్ గార్గ్ ఇన్వెస్టర్లకు కొన్ని కీలక సూచనలు చేశారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై గార్గ్ స్పందిస్తూ.. ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పిన ఒక మాటను గుర్తు చేశారు. అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశతో ఉండండి.. అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి.. గతంలో వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్లు మరింత లాభాల కోసం ఎదురుచూశారని, కానీ తాము అప్పుడే లాభాలను స్వీకరించాలని హెచ్చరించామని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Air Cooler: ఏసీని సైతం తలదన్నే ఎయిర్ కూలర్.. అతి తక్కువ ధరల్లోనే ఏసీ లాంటి కూలింగ్!
ఇప్పటికే ఎక్కువ ధరలకు కొన్నవారు.. ఇప్పుడు తక్కువ ధర వద్ద మరికొంత కొనుగోలు చేసి తమ పెట్టుబడిని ‘యావరేజ్’ (Average) చేసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో ధరలు పెరిగినప్పుడు త్వరగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో అనిశ్చితి ఉన్నప్పుడు ఆందోళన చెంది అమ్మేయకండి మార్కెట్ మళ్లీ కోలుకుంటుందని, ఓపికగా ఉండటమే స్మార్ట్ ఇన్వెస్టర్ లక్షణమని ఆయన సూచించారు. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దిద్దుబాటు దిశలో ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Electric Scooter: సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ అయిపోయినా ప్రయాణం అగదు.. సైకిల్‌గా మారే ఈవీ
ఇది కూడా చదవండి: Ola Electric Bike: ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.60 వేలు తగ్గింపు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ రేంజ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి