Paytm Lay Off’s: బలవంతపు రాజీనామాలపై పేటీఎంకు షాక్.. సమన్లు జారీ చేసిన లేబర్ కమిషన్

|

Jul 12, 2024 | 4:30 PM

భారతదేశంలో ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఒడిదుడుకులతో సతమతమవుతాన్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు సమయంలో డిజిటల్ పేమెంట్స్ విషయంలో కీలకంగా మారిన పేటీఎం తర్వాత కాలంలో సంక్షోభంలో చిక్కుకుంది. ముఖ్యంగా ఆర్‌బీఐ నిబంధనలతో పేటీఎం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే ఇటీవల పేటీఎం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపు విషయంలో పేటీఎం మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వాపోతున్నారు.

Paytm Lay Off’s: బలవంతపు రాజీనామాలపై పేటీఎంకు షాక్.. సమన్లు జారీ చేసిన లేబర్ కమిషన్
Paytm
Follow us on

భారతదేశంలో ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఒడిదుడుకులతో సతమతమవుతాన్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు సమయంలో డిజిటల్ పేమెంట్స్ విషయంలో కీలకంగా మారిన పేటీఎం తర్వాత కాలంలో సంక్షోభంలో చిక్కుకుంది. ముఖ్యంగా ఆర్‌బీఐ నిబంధనలతో పేటీఎం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే ఇటీవల పేటీఎం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపు విషయంలో పేటీఎం మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని లేబర్ కమిషన్‌ను పలువురు ఉద్యోగుల ఆశ్రయించారు. అయితే పేటీఎంపై లేబర్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుందో? ఓ సారి తెలుసుకుందాం. 

బెంగళూరు ప్రాంతీయ లేబర్ కమిషనర్ వన్ 97 కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్‌కు సమన్లు ​​జారీ చేశారు. ఉద్యోగాల కోతలను నివేదించిన తర్వాత కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు సిబ్బంది చేసిన వరుస ఫిర్యాదుల తర్వాత లేబర్ కమిషన్ నోటీసు జారీ చేసింది. కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, ఎలాంటి వేతనం లేకుండా తమను తొలగించిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఉద్యోగుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని వన్ 97 కమ్యూనికేషన్స్ పేర్కొంది. ముఖ్యంగా తొలగింపు ప్యాకేజీ తర్వాత ఎటువంటి ముందస్తు సమాచారం లేదా పరిహారం లేకుండా బలవంతంగా రాజీనామా చేయించాలరని సిబ్బంది చెబతున్నారు. అలాగే బోనస్ తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేశారని సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే జాయినింగ్ బోనస్‌ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అలాగే ఉద్యోగికి నోటీసు వ్యవధి చెల్లింపును అందించడానికి వన్ 97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అనంతరం ప్రాంతీయ లేబర్ కమిషనర్ (సెంట్రల్), బెంగళూరు సమక్షంలో పేటీఎం చేసిన నిష్క్రమణ ఆఫర్‌ను ఉద్యోగి అంగీకరించారని. ఫలితంగా రెండు పార్టీలు సంతృప్తి చెందేలా ఫిర్యాదును పరిష్కరించారని వర్గాలు తెలిపాయి.

పేటీఎంకు సంబంధించిన కీలక అనుబంధ సంస్థ పేటీఎం చెల్లింపు సేవలకు చైనా నుంచి 50 కోట్ల రూపాయల నిధులను పర్యవేక్షించడానికి కేంద్రం ఆమోదం పొందిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉందని తెలుస్తుంది. పేటీఎం చెల్లింపు సేవలకు తుది ఆమోదం లభిస్తే అది సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..