
బ్రెజ్జా కారులోని వివిధ రకాల వేరియంట్ల ధరను మారుతీ సుజుకి కంపెనీ పెంచింది. ఆ ప్రకారం ఎల్ఎక్స్ఐ ట్రిమ్ రూ.15 వేలు పెరిగింది. వీఎక్స్ఐ రూ.5.500, జెడ్ ఎక్స్ఐ రూ.11,500 పెరుగుదలను చూశాయి. అయితే టాప్ టైర్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ ధర మాత్రం పెరగలేదు. ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం బ్రెజ్జా కార్ల శ్రేణిలో భద్రత లక్షణాలను మెరుగుపర్చారు. దీని వల్ల ఆ కారు ధరలు పెరిగాయి. ముఖ్యంగా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేశారు. మూడు పాయింట్ల ఈఎల్ఆర్ వెనుక సెంటర్ సీటు బెల్టులు, ఎత్తును సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీటు బెల్టులు, 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, కప్ హోల్డర్లతో కూడిన వెనుక సెంటర్ ఆర్మ్ రెస్టు, అడ్జెస్టబుల్ బ్యాక్ హెడ్ రెస్టులను అమర్చారు.
మారుతీ సుజుకి బ్రెజ్జాలో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 6 వేల ఆర్పీఎం వద్ద 102 బీహెచ్ పీ, 44 వేల ఆర్పీఎం వద్ద 136.8 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్, యాక్సిలరేషన్ సమయంలో టార్క్ అసిస్ట్, ఐడిల్ స్టార్ట్ – స్టాప్ ఫంక్షన్ అదనపు ప్రత్యేకతలు. సీఎన్ జీ వెర్షన్ లో కూడా ఈ కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ మోడ్ లో ఇంజిన్ నుంచి 86 బీహెచ్పీ, 121 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. ప్రత్యేకంగా మాన్యువల్ గేర్ బాక్స్ ను జత చేశారు.
మారుతీ సుజుకి బ్రెజ్జా కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సన్ రూఫ్, వైర్ లెస్ చార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు రకాల వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. దీనిలో 328 లీటర్ల బూట్ స్పేస్ చాలా అనుకూలంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కోడా కైలాక్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్రైట్, రినాల్ట్ కిగర్, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ వో కార్లతో మారుతీ బ్రెజ్జా పోటీ పడనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి