Stock Market: స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ మండే.. భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్లకు నేడు బ్యాడ్ డే అని చెప్పాలి. ఎస్, సెన్సెక్స్, నిఫ్టీ ఘోరంగా పతనమయ్యాయి. దాదాపు రెండు శాతం వరకు పడిపోయాయి.

Stock Market: స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ మండే.. భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market

Updated on: Nov 22, 2021 | 9:13 PM

స్టాక్‌ మార్కెట్లకు నేడు బ్యాడ్ డే అని చెప్పాలి. ఎస్, సెన్సెక్స్, నిఫ్టీ ఘోరంగా పతనమయ్యాయి. దాదాపు రెండు శాతం వరకు పడిపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 11 వందల 70 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 348 పాయింట్లకు పైగా కోల్పోయింది. మార్కెట్లు ఓపెన్ అయినప్పటి నుంచీ పతనం కొనసాగింది. మధ్యాహ్నం సమయంలో కాస్త కోలుకున్నట్టు కనిపించినా.. తీవ్ర ఒడిదుడుకుల మధ్య డౌన్‌ఫాల్‌ కంటిన్యూ అయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఏకంగా 1600 పాయింట్లకు పైగా పతనమైంది.

కరోనా తర్వాత స్టాక్‌మార్కెట్ క్రమంగా కోలుకుని.. ఆల్‌టైమ్‌ హై దిశగా దూసుకెళ్లింది. ఆ ట్రెండ్‌కు బ్రేక్‌ పడిందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు నెగెటివ్‌గా ఉండడం.. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో బుల్స్‌పై బేర్‌ పట్టు బిగిసినట్టయింది.

సెన్సెక్స్‌లో కేవలం నాలుగంటే నాలుగు షేర్లు మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి. అది కూడా టారిఫ్‌ పెంచిన భారతీ ఎయిర్‌టెల్‌ అత్యధికంగా లాభపడింది. మార్నింగ్ సెషన్‌ నుంచీ ఆ షేరు దూకుడు ప్రదర్శించింది. బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్‌ అత్యధికంగా నష్టపోయాయి. టెలికాం మనిహా అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిశాయి. ఈమధ్య స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన ఏడు కంపెనీల్లో నాలుగు షేర్లు ఇష్యూ ధర కంటే కిందికి దిగజారాయి. పేటీఎం అత్యధికంగా 14 శాతం నష్టపోయింది.

Also Read: నీటిలో మొసలికి చిక్కి కూడా ప్రాణాలతో బయటపడ్డ అడవి బర్రె.. షాకింగ్ వీడియో

కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..

Loading...
Unable to load recommendations.
Follow Us