
ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌లో భానుడి భగభగలు ఏకంగా 100 ఏళ్ల రికార్డు బద్దలు కొడితే.. ఇక మే, జూన్ నెలల్లో వేసవి తాపం ఇంకెంతగా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. ఈ తరుణాన్ని వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. స్ప్లిట్, విండో ఎయిర్ కండిషనర్లతో పాటు ఎయిర్ కూలర్ల రేట్లను కూడా అమాంతం పెంచేశారు. అందుకే సామాన్యుల కోసం మినీ, పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి చూసేందుకు చిన్నగా ఉంటాయి. కానీ సామర్ధ్యం ఎక్కువ. తక్కువ ధరతోనే మీ ఇంటిని చల్లబరుస్తాయి. సాధారణంగా గోడ ఏసీలకు ఇన్‌స్టాలేషన్ చేయాలి. అది ఇంకో ఖర్చు అవుతుంది. కానీ ఈ పోర్టబుల్ ఏసీలకు అక్కర్లేదు. ఏ గదిలోనైనా పెట్టొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ కోవలోనే ఓ మినీ పోర్టబుల్ ఏసీని మీ ముందుకు తీసుకొచ్చేశాం. దాని ఫీచర్లు, ధర ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ షాలేక్ పోర్టబుల్ ఎయిర్ కూలర్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీనికి స్పీడ్ కంట్రోల్‌కి మూడు మోడ్స్ ఉన్నాయి. అలాగే ఎయిర్ వీచే దిశను కూడా మనం ఈజీగా మార్చుకోవచ్చు. తక్కువ శబ్దం వస్తుంది కాబట్టి.. రాత్రిపూట ఇది స్విచ్ ఆన్ చేసుకుని.. మీరు ఎంచక్కా పడుకోవచ్చు. అలాగే ఇందులోని 4000 mAh రీచార్జబుల్ బ్యాటరీ.. పూర్తి చార్జ్ అయ్యాక 4 గంటల పాటు నిరంతరంగా పని చేస్తుంది. దీని ధర దాదాపు రూ. 9 వేలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం అయితే స్టాక్ లేదని చూపిస్తోంది. ఇది వేడి గాలిని తేమగా మార్చి.. మీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని ఇట్టే చల్లబరుస్తుంది. మీరూ ఓ లుక్కేయండి.(Source)