Stock Market: అంతటా ఊచకోతే.. ఆ ఒక్క కారణంతో కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు.. రూటు మార్చిన ఇన్వెస్టర్లు..

గ్లోబల్ మార్కెట్స్ గూబగుయ్యిమనేలా రీసౌండ్ చేస్తున్నాయి. మన దేశీయ మార్కెట్లు కూడా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో గత మూడురోజుల నుంచి మార్కెట్లలో ఊచకోత కంటిన్యూ అవుతోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకున్నా, పతనం మాత్రం కొనసాగుతోంది. ఇవాళ సెన్సెక్స్ 270పాయింట్లు, నిఫ్టీ 75పాయింట్లు నష్టంతో క్లోజ్ అయ్యాయి.

Stock Market: అంతటా ఊచకోతే.. ఆ ఒక్క కారణంతో కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు.. రూటు మార్చిన ఇన్వెస్టర్లు..
Stock Market

Updated on: Jan 21, 2026 | 6:15 PM

గ్లోబల్ మార్కెట్స్ గూబగుయ్యిమనేలా రీసౌండ్ చేస్తున్నాయి. మన దేశీయ మార్కెట్లు కూడా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో గత మూడురోజుల నుంచి మార్కెట్లలో ఊచకోత కంటిన్యూ అవుతోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకున్నా, పతనం మాత్రం కొనసాగుతోంది. ఇవాళ సెన్సెక్స్ 270పాయింట్లు, నిఫ్టీ 75పాయింట్లు నష్టంతో క్లోజ్ అయ్యాయి. ఎందుకిలా జరుగుతోంది..అంటే అందరి వేళ్లూ ఒక్కరినే చూపిస్తున్నాయి. ఆ ఒక్కడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

స్టాక్ మార్కెట్ల ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలే అంటున్నారు నిపుణలు. టారిఫ్‌ల పెంపు, వాణిజ్య యుద్ధాల హెచ్చరికలు.. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అమెరికా–చైనా, అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు రిస్క్ తీసుకునే ధైర్యం చేయడంలేదు. మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫెడ్ రేట్లు తగ్గిస్తుందా లేదా అన్న క్లారిటీ లేకపోవడంతో పెట్టుబడులు ఈక్విటీల నుంచి బయటకు వెళ్తున్నాయి.

మార్కెట్ల పతనానికి మరో కారణం, బంగారం వెండి ధరలు అమాంతం పెరగడం. స్టాక్ మార్కెట్లలో రిస్క్ పెరిగిందన్న భావనతో ఇన్వెస్టర్లు సేఫ్ అస్సెట్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు తీసి, బంగారం, వెండి వంటి భద్రమైన పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారు. ఇది స్పష్టంగా మెటల్ మార్కెట్లలో కనిపిస్తోంది. దీంతో బంగారం, వెండి రేట్లు భారీగా పెరుగుతున్నాయి..

మరోవైపు మన రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 91రూపాయల70పైసలకు పడిపోయింది. గ్లోబల్ అనిశ్చితితో పాటు ట్రంప్ నిర్ణయాల షాక్‌తో ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి పతనం కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ల నష్టాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, బంగారం–డాలర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో రూపాయి విలువ మరింత పడిపోయింది.

అయితే.. ఇప్పుడు ఇలా ఉన్నా.. మున్ముందు పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు మార్కెట్ నిపుణులు.. కొంతకాలం తటస్థంగా కొనసాగే అవకాశం ఉందని.. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు భయపడకుండా ఇన్వెస్ట్‌మెంట్లను కంటిన్యూ చేయాలని సూచిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..