Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మళ్లీ తగ్గిన హెచ్‌డిఎఫ్‌సీ గ్రూప్ షేర్లు..

|

Apr 08, 2022 | 9:48 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక విధాన నిర్ణయానికి ముందు స్టాక్‌ మార్కెట్లు(Stock Market) స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి...

Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మళ్లీ తగ్గిన హెచ్‌డిఎఫ్‌సీ గ్రూప్ షేర్లు..
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక విధాన నిర్ణయానికి ముందు స్టాక్‌ మార్కెట్లు(Stock Market) స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 లకు సెన్సెక్స్(Sensex) 20 పాయింట్లు పెరిగి 59050 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్ల్ పెరిగి 17,651 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.68, స్మాల్ క్యాప్ షేర్లు 0.63 శాతం పెరిగి ట్రేడవుతున్నాయి. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.81, నిఫ్టీ మెటల్ 1.09 శాతం పెరిగాయి. కోల్ ఇండియా 2.88 శాతం జంప్ చేసి రూ. 196.25కి పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, హిందాల్కో షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి.

30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఎన్‌టిపిసి, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్), హెచ్‌సిఎల్ టెక్, నెస్లే ఇండియా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం మెగా-విలీన ప్రకటన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక్కొక్కటి 10 శాతం పెరిగాయి. ఆ తర్వాత రెండు స్టాక్‌లు క్షీణించాయి. గురువారం సెన్సెక్స్ 575 పాయింట్లు పడిపోయి 59,035 వద్ద ముగియగా, నిఫ్టీ 168 పాయింట్లు క్షీణించి 17,640 వద్ద స్థిరపడింది.

Read Also.. HUL Stock: హిందూస్తాన్‌ యూనిలివర్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా.. కంపెనీ పూర్తి వివరాలు..