ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు(Sotck Market) బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.29 గంటలకు బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 360, ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 100 పాయింట్ల లాభాలతో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, సిప్ల, టెక్ మహింద్రా, ఇన్పోసిస్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, శ్రీ సిమెంట్ లాభాల్లో ఉండగా.. ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.59 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.52 శాతం పెరిగింది. నిఫ్టీ ఐటీ1.11 నిఫ్టీ ఫార్మా 1.01 శాతం చొప్పున పెరిగాయి. మంగళవారం సెన్సెక్స్ 1,345 పాయింట్లు లేదా 2.54 శాతం పుంజుకుని 54,318 వద్ద ముగియగా, నిఫ్టీ 417 పాయింట్లు లేదా 2.63 శాతం పెరిగి 16,259 వద్ద స్థిరపడింది. షాంఘైలో లాక్‌డౌన్ సడలింపుకు సంబంధించిన ప్రకటనల తర్వాత పెట్టుబడిదారుల సెంటిమెంట్‌లు ఊపందుకున్నాయి. మంగళవారం నాటి ముగింపు 77.56తో పోలిస్తే బుధవారం డాలర్‌తో రూపాయి విలువ 77.56 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది.
మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..