Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 86, నిఫ్టీ 35 పాయింట్లు అప్..

|

Mar 11, 2022 | 7:19 PM

స్టాక్ మార్కెట్లు(Stock Market) వారంతంలో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఫార్మా(Pharma), హెల్త్‌కేర్(HealthCare) స్టాక్‌ల లాభాలతో సెన్సెక్స్ 85.91 పాయింట్లి పెరిగి 55,550 వద్ద స్థిరపడింది..

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 86, నిఫ్టీ 35 పాయింట్లు అప్..
Stock Market
Follow us on

స్టాక్ మార్కెట్లు(Stock Market) వారంతంలో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఫార్మా(Pharma), హెల్త్‌కేర్(HealthCare) స్టాక్‌ల లాభాలతో సెన్సెక్స్ 85.91 పాయింట్లి పెరిగి 55,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35.55 పాయింట్ల పెరిగి 16,630 వద్ద ముగిసింది. భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు పెరిగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.61 శాతం, స్మాల్ క్యాప్ 0.91 శాతం లాభపడింది. నిఫ్టీ ఫార్మా 2.46 శాతం, నిఫ్టీ హెల్త్‌కేర్ 2.60 శాతం పెరిగాయి. నిఫ్టీ ఆటో మాత్రం 0.40 శాతం పడిపోయింది. సిప్లా 5.87 శాతం పెరిగి రూ. 1,045కి చేరుకోవడంతో నిఫ్టీ టాప్ గెయినర్‌గా నిలిచింది. బీపీసీఎల్, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా లాభపడ్డాయి.

లోహల ధర పెరుగుదల, సెమీకండక్టర్ల కొరతతో ఆటో కంపెనీలు నష్టాలను చవిచూశాయి. క్రూడ్ ఆయిల్ బ్రెంట్ బ్యారెల్ ధర 2.09 డాలర్లు తగ్గి.. 109.9 డాలర్లుగా ఉండగా.. WTI బ్యారెల్ 2.9 డాలర్లు 106.71 వద్ద కొనసాగుతున్నాయి. రూపాయి 27 పైసలు పడిపోయి 76.58 వద్ద స్థిర పడింది. గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి.

ఈ మూడు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.10.83 లక్షల కోట్లు పెరిగింది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 817 పాయింట్లు జంప్ చేసి 55,464 వద్ద ముగిసింది. మూడు రోజుల్లో సెన్సెక్స్ 2621 పాయింట్లు పెరిగింది. ఈ మూడింటి పెరుగుదల కారణంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.251 లక్షల 93 వేల కోట్లకు పెరిగింది. నేడు రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన భేటీ ప్రభావం రేపు మార్కెట్‌పై కనిపించనుంది. హెచ్‌యుఎల్, టాటా స్టీల్, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే, మారుతీ సుజుకీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. మరోవైపు టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌ ఎక్కువగా నష్టపోయాయి.

Read Also.. Car Prices Hike: మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమైన ఆటోమొబైల్ కంపెనీలు..!