Stock Market: నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు.. ఆయిల్, మెటల్, బ్యాంక్‌ స్టాక్‌ల్లో క్షీణత..

|

Jun 20, 2022 | 12:41 PM

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 9:40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 51,192 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 71 పాయింట్లు పతనమై 15,219 వద్ద కొనసాగుతోంది...

Stock Market: నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు.. ఆయిల్, మెటల్, బ్యాంక్‌ స్టాక్‌ల్లో క్షీణత..
Stock Market
Follow us on

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 9:40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 51,192 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 71 పాయింట్లు పతనమై 15,219 వద్ద కొనసాగుతోంది. మిడ్‌ క్యాప్‌ 1.62, స్మాల్‌ క్యాప్‌ 1.86 శాతం పోడిపోయాయి. సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ బ్యాంక్ 0.54, నిఫ్టీ ఐటీ 0.54 శాతం తగ్గాయి. ముఖ్యంగా ఆయిల్‌, మెటల్‌ స్టాక్‌ల్లో పతనం కొనసాగుతోంది. వేదాంత షేరు 6 శాతం పడిపోయింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ సూచీలు తొలి సెషన్‌ లాభాలను కోల్పోయాయి. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.92 వద్ద కొనసాగుతోంది.

సన్‌ ఫార్మా నిఫ్టీ టాప్‌ గెయినర్‌గా ఉంది. ఈ స్టాక్‌ 1.53 శాతం పెరిగి రూ.805.50 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ-30లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, డా. రెడ్డీస్, విప్రో, అల్ట్రా టెక్‌ సిమెంట్ లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, ఎం&ఎం, L&T, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు పతనమై 51,360.42 వద్ద ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 15,293.50 వద్ద స్థిరపడింది. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లలో నమోదైన ఈ-ముద్ర మార్చి 2022తో ముగిసిన త్రైమాసికపు లాభాల్లో 62.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.