Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 350, నిఫ్టీ 103 పాయింట్ల వృద్ధి..

|

Mar 29, 2022 | 5:19 PM

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి...

Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 350, నిఫ్టీ 103 పాయింట్ల వృద్ధి..
stock market
Follow us on

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. వాల్ స్ట్రీట్‌లో టెక్-లీడ్ ర్యాలీకి అనుగుణంగా ఆసియా మార్కెట్లు కూడా హై రేంజ్‌లో ట్రేడ్ అయ్యాయి. మంగళవారం BSE సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 57,944 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 17,325 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.41 శాతం, స్మాల్ క్యాప్ 0.34 శాతం పెరిగాయి. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.03, నిఫ్టీ ఫార్మా 1.54, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.01 శాతం చొప్పున పెరిగాయి. ఐషర్ మోటార్స్ స్టాక్ 4.50 శాతం పెరిగి రూ. 2,487కి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి, దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ కూడా లాభాల్లో ముగిశాయి. 1,436 కంపెనీల షేర్లు పెరగ్గా, 1,975 కంపెనీల షేర్లు తగ్గాయి.

బిఎస్‌ఇ ఇండెక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా లాభపడ్డాయి. ITC, IndusInd బ్యాంక్, SBI, టాటా స్టీల్, NTPC, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ నష్టాల్లో స్థిరపడ్డాయి. హీరో మోటోకార్ప్ ఆఫీస్‌ల్లో ఐటీ దాడులు కారణంగా ఆ కంపెనీ షేర్లు 6.68 శాతం పడిపోయి రూ. 2,219కి చేరుకున్నాయి.

Read Also..insurance Alert: గుడ్డిగా తెలిసినవారి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు కొనకండి.. తరువాత ఈ ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త..