Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 534, నిఫ్టీ 159 పాయింట్ల వృద్ధి

|

Oct 04, 2021 | 5:23 PM

గత వారం వరుస నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాల బాట పట్టింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి అదరగొట్టాయి...

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 534, నిఫ్టీ 159 పాయింట్ల వృద్ధి
Stock Market
Follow us on

గత వారం వరుస నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాల బాట పట్టింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి అదరగొట్టాయి. ఈ వారం ట్రేడింగ్‌ను లాభాలతో ఆరంభించాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర లాభపడింది. ముఖ్యంగా రియల్టీ, మెటల్‌, పవర్‌ సెక్టార్‌ షేర్లు రాణించడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం 59,063 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 667 పాయింట్లు ఎగిసిన సూచీ.. చివరికి 533.74 పాయింట్ల లాభంతో 59,299 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 159.30 పాయిట్లు లాభపడి 17,691 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.31గా ఉంది.

నిఫ్టీలో దివీస్‌ ల్యాబ్స్‌ అదరగొట్టింది. ఏకంగా 8 శాతం లాభాలు సొంతం చేసుకుంది. దివీస్‌తో పాటు హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌ షేర్లు రాణించాయి. సిప్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఐవోసీ షేర్లు నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. రియల్టీ, మెటల్‌, పవర్‌ సెక్టార్‌ షేర్లు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీ షేర్లు కూడా బాగానే లాభపడ్డాయి. టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ 107 పాయింట్లు, టీసీఎస్ 50, మైండ్ ట్రీ 67, ఇన్ఫోసిస్ 14, విప్రో 6, హెచ్‎సీఎల్ 5, బిర్లాసాఫ్ట్ 9 పాయింట్ల చొప్పున లాభాలను ఆర్జించాయి.

శుక్రవారం ఆర్‎​బీఐ ద్రవ్యపరపతి విధానంపై సమీక్ష నిర్వహించనుంది. అదే రోజు దేశీయ టెక్​ దిగ్గజం టీసీఎస్​ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ అంశాలన్ని మార్కెట్లను ప్రభావితం చేసే కీలకంగా ఉండనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Read Also.. Digital Currency: డిజిటల్ కరెన్సీ తయారీ దిశగా రిజర్వ్ బ్యాంక్ అడుగులు.. రూపకల్పనలో కంగారులు