Sensex: ఒడిదుడుకులతో సాగి.. స్వల్ప నష్టంతో ముగిసిన సెన్సెక్స్.. ఏ షేర్లు నష్టపోయాయంటే..

|

Nov 30, 2021 | 7:32 PM

స్టాక్ మార్కెట్ ఈరోజు(నవంబర్ 30) విపరీతమైన ఒడిదుడుకులతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది.

Sensex: ఒడిదుడుకులతో సాగి.. స్వల్ప నష్టంతో ముగిసిన సెన్సెక్స్.. ఏ షేర్లు నష్టపోయాయంటే..
Stock Market
Follow us on

Sensex: స్టాక్ మార్కెట్ ఈరోజు(నవంబర్ 30) విపరీతమైన ఒడిదుడుకులతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ రోజులో 923 పాయింట్ల వరకు పెరగగా, తరువాత 1,316 పాయింట్ల వరకు పడిపోయింది. చివరకు 195 పాయింట్లు (0.34%) క్షీణించి 57064 వద్ద ముగిసింది.

నిఫ్టీ 82 పాయింట్లు పతనం..

అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 82 పాయింట్లు (0.48%) పడిపోయి 16,972 వద్ద ముగిసింది. రోజులో సెన్సెక్స్ గరిష్టంగా 58,183 వద్ద ఉండగా, కనిష్ట స్థాయి 56,867 వద్ద నిలిచింది. ఉదయం మార్కెట్ 12 పాయింట్ల లాభంతో 57,272 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 14 షేర్లు లాభాలతో ముగియగా, 16 షేర్లు క్షీణించాయి. పవర్ గ్రిడ్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి. నెస్లే, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా లాభాలతో ముగిశాయి.

టాటా స్టీల్‌ షేర్లు 4 శాతం నష్టపోయాయి..

పడిపోయిన స్టాక్స్‌లో టాటా స్టీల్ 4% పతనమవగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.08% పడిపోయింది. బజాజ్ ఆటో, ఎయిర్‌టెల్, రిలయన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సహా ఇతర షేర్లు క్షీణించాయి. ఈ షేర్లన్నీ 1 నుంచి 2 శాతం నష్టపోయాయి. ఈరోజు మొదటి నిమిషంలో, మార్కెట్ క్యాప్ రూ. 4.16 లక్షల కోట్లు పెరగగా, తరువాత అది రూ. 256.89 లక్షల కోట్లకు తగ్గింది. నిన్న రూ.256.94 లక్షల కోట్లు కాగా నేడు రూ.261.10 లక్షల కోట్లకు చేరుకుంది.

నిఫ్టీ 17,051 వద్ద ప్రారంభమైంది

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 17,051 వద్ద ప్రారంభమైంది. రోజులో గరిష్టంగా 17,324 నమోదు కాగా, కనిష్టంగా 17,051 నమోదైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ లాభాలతో ముగియగా, బ్యాంక్, ఫైనాన్షియల్ సూచీలు క్షీణించాయి. దాని 50 స్టాక్‌లలో 22 లాభాలతో ముగియగా, 28 క్షీణించాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్ ఎక్కువగా నష్టపోయాయి.

నిన్న మార్కెట్ లాభాలతో ముగిసింది

నిన్న, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 153 పాయింట్ల (0.27%) లాభంతో 57,260 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 27.50 (0.16%) పాయింట్ల లాభంతో 17,053 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..