Google Search: కొంపముంచిన గూగుల్.. అలా సెర్చ్ చేశారు.. సీన్ కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్..

|

Feb 25, 2023 | 4:57 PM

ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది. సైబర్ మోసాలపై అజాగ్రత్తగా ఉంటే, భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ కుటుంబం రూ.8 లక్షలకు పైగా మోసపోయిన ఉదంతం తెరపైకి వచ్చింది.

Google Search: కొంపముంచిన గూగుల్.. అలా సెర్చ్ చేశారు.. సీన్ కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్..
Google Search
Follow us on

ఆన్‌లైన్‌లో మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలను ట్రాప్ చేయడానికి స్కామర్లు ఆన్‌లైన్‌లో పలు రకాల ట్రిక్కులతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల నోయిడాలో ఆన్‌లైన్ మోసం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక వినియోగదారు రూ.8.24 లక్షలు మోసపోయాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు ఆన్‌లైన్ సెర్చింగ్ కారణం కావడం గమనార్హం.

బాధితులు సీనియర్ సిటిజన్లు కావడంతో పోలీసులు కూడా తీవ్రంగానే దర్యాప్తు చేస్తున్నారు. డిష్‌వాషర్ కోసం కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చింగ్ చేస్తున్నారు. బాధిత దంపతులు నోయిడాలోని సెక్టార్ 133లో నివసిస్తున్నారు. ఫిర్యాదు ప్రకారం, ఈ ఆన్‌లైన్‌లో మోసం జనవరి 22, జనవరి 23న జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎలా జరిగింది?

ఎఫ్‌ఐఆర్ ప్రకారం అమర్‌జిత్ సింగ్, అతని భార్య గూగుల్‌లో ఐఎఫ్‌బీ డిష్‌వాషర్ కస్టమర్ కేర్ నంబర్‌ను వెతుకుతున్నారు. ఐఎఫ్‌బీ కస్టమర్ కేర్ పేరుతో గూగుల్‌లో ఉన్న ఆన్‌లైన్ సెర్చ్ నుంచి అతని భార్య 1800258821 నంబర్‌ను కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ నంబర్ ఇప్పుడు బంధన్ బ్యాంక్ కస్టమర్ కేర్‌గా చూపిస్తోంది. తన భార్య ఈ నంబర్‌కు కాల్ చేయగా, ఒక మహిళ ఫోన్‌ని తీసి, కాల్‌ను కనెక్ట్ చేయమని తన సీనియర్‌ని కోరిందని బాధితుడు చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత, బాధితులను ఫోన్‌లో ఎనీడెక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని కోరారంట. ఆ మేరకు కొన్ని వివరాలను అడిగి, తెలుసుకున్నట్లు బాధితులు తెలిపారు. ఆ తర్వాత ప్రాసెస్ చేసేందుకు రూ.10 లావాదేవీ చేయాలని సదరు మహిళను కోరారంట.

ఈ క్రమంలో, దుండగుల కాల్‌లు చాలాసార్లు డిస్‌కనెక్ట్ కావడంతో.. బాధితురాలికి వారి వ్యక్తిగత నంబర్ నుంచి నిరంతరం కాల్ చేశారంట. అదే రోజు సాయంత్రం 4.15 గంటలకు వృద్ధుడి ఖాతా నుంచి రూ.2.25 లక్షల లావాదేవీ జరిగిందంట. మరుసటి రోజు ఉదయం బాధితులు మరో మెసేజ్ చూశాడు. అందులో రూ. 5.99 లక్షలు ట్రాన్సఫర్ అయినట్లు కొనుగొన్నారు.

దీంతో బాధితులు పోలీసులకు, బ్యాంకుకు సమాచారం అందించింది. ఆ తర్వాత తన జాయింట్ ఖాతాను నిలిపేశారు. అయితే, అప్పటికే చాలా ఆలస్యం కావడంతో బాధితుల ఖాతా నుంచి భారీగా డబ్బులు డ్రా అయ్యాయి.

ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటివే..

ఈ ఆన్‌లైన్ మోసం కొత్తది కాదు. ఇలాంటి ఉదంతాలు గతంలో కూడా చాలా సార్లు కనిపించాయి. వాస్తవానికి, స్కామర్లు కొన్నిసార్లు కస్టమర్ కేర్ పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అనేక నకిలీ నంబర్‌లను నమోదు చేస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం.

ఈ కారణంగా వినియోగదారులు ఆన్‌లైన్‌లో వెతికినప్పుడల్లా, ఈ నకిలీ నంబర్స్ కనిపిస్తున్నాయి. వారి ఉచ్చులో చిక్కుకున్న తర్వాత వినియోగదారు కాల్ చేస్తే, స్కామర్లు ఈజీగా మోసం చేసేస్తుంటారు. ఇటువంటి మోసాల నుంచి రక్షించుకోవడానికి, మీరు ఆన్‌లైన్‌లో శోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఏ నంబర్‌కు కాల్ చేయవద్దు. బదులుగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కస్టమర్ కేర్ నంబర్‌ను కచ్చితమైనదని గుర్తించాకే, కాల్ చేయాలి. అదే సమయంలో వ్యక్తిగత పరికరంలో AnyDesk లేదా మరే ఇతర యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అందివ్వకూడదు.

ఇది స్కామర్‌లకు మీ డేటాకు యాక్సెస్ ఇస్తుంది. కస్టమర్ కేర్ మీ నుంచి ఎప్పుడూ డబ్బులు అడగరు. కానీ మీరు ఏదైనా సేవ కోసం చెల్లించవలసి వస్తే, ఓసారి ఆలోచించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..