Business Ideas: తక్కువ పెట్టుబడితో చేసే 5 బెస్ట్ బిజినెస్ ఐడియాలు.. మూడోది చాలా సింపుల్!

నెలవారీ ఆదాయం సరిపోక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లు ఏదైనా రెండో సైడ్ ఇన్ కమ్ ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి బిజినెస్ కు పెట్టుబడి కావాలిగా? అని ఆలోచిస్తున్నారా? రూ.10 వేల నుంచి రూ.20 వేలలో చేసుకోగదగ్గ బెస్ట్ బిజినెస్ ఐడియాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Business Ideas: తక్కువ పెట్టుబడితో చేసే 5 బెస్ట్ బిజినెస్ ఐడియాలు.. మూడోది చాలా సింపుల్!
Business Ideas

Updated on: Sep 16, 2025 | 4:05 PM

సొంతంగా బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఉండాలే గానీ పెట్టుబడి పెద్ద సమస్యే కాదు. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో లేదా పెట్టుబడి లేకుండా కూడా చేయగలిగే వ్యాపారాలు బోలెడు ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ ఐడియాలు మీకోసం..

1. హోమ్ మేడ్ ఫుడ్స్

మీకు స్వీట్స్ లేదా బేకరీ ప్రొడక్ట్స్ లేదా పచ్చళ్లు అయినా పర్లేదు. టేస్టీగా చేసే టాలెంట్ ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయొచ్చు. ముందుగా కొన్ని సాంపిల్స్ రెడీ చేసి వాటిని ఫొటోలు  లేదా రీల్స్ రెడీ చేసి.. ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేయాలి. ఫాలోవర్స్ కోసం కాస్త క్రియేటివ్ గా పోస్టులు పెడుతుండాలి. ఇన్ స్టా్గ్రామ్ ద్వారా ఆర్డర్స్ తీసుకుని కొరియర్ ద్వారా మీ ప్రొడక్ట్స్ డెలివరీ చేయొచ్చు. ముందస్తు పెట్టుబడి కూడా ఉండదు. ఆర్డర్ వచ్చాక కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.

2.  ఆన్ లైన్ కోర్స్

మీకు ఎందులోనైనా కాస్త నాలెడ్జ్ ఉంటే.. దాన్ని ఆన్ లైన్ ద్వారా సేల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇంగ్లిష్, హిందీ వంటి లాంగ్వేజెస్ కావొచ్చు. లేదా కేక్స్ తయారీ, కేక్ ఆర్ట్, ఎంబ్రాయిడరీ లేదా టీచింగ్ సబ్జెక్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, మెహందీ, రంగోళీ.. ఇలా మార్కెటింగ్ కు కాదేదీ అనర్హం. మీకు వచ్చిన స్కిల్ ను నాలుగైదు వీడియోల రూపంలో రికార్డు చేసి యూడెమీ వంటి ప్లాట్ ఫామ్స్ లో కోర్సుగా అప్ లోడ్ చేయొచ్చు. కావాల్సిన వాళ్లు దాన్ని నేర్చుకుంటారు.

3. అఫిలియేట్ మార్కెటింగ్

ఇది చాలా సింపుల్ బిజినెస్. కావాల్సిందల్లా.. మీకంటూ కొంత సర్కిల్. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక యాభై లేదా వంద మంది ఉన్నట్టయితే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ తర్వాత అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అఫీలియేట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు రోజూ ఆయా యాప్స్ చూస్తూ.. అందులో ఆఫర్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. వంద మందిలో ఒక పది మంది ఆ లింక్ ద్వారా ఏదైనా ప్రొడక్ట్ కొంటే మీకు కమీషన్ వస్తుంది. ఇలా నెలకు ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది.

4. పెట్ కేర్ సర్వీసెస్‌

హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో పొద్దున్నే ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతుంటారు. ఇలాంటప్పుడు ఇంట్లో ఉండే పెట్స్ ను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను మీరు బిజినెస్ గా మార్చుకోవచ్చు. మీ ఇంటి దగ్గర లేదా ఇంట్లో కాస్త ఖాళీప్లేస్ ఉంటే ఈ సర్వీస్ మీరు మొదలుపెట్టొచ్చు. పెట్స్‌ కేర్ సెంటర్ ఒకటి ఓపెన్ చేయండి. ఆయా పెట్స్ ను జాగ్రత్తగా చూసుకోండి. నెలకు ఇంత అని ఛార్జ్ చేయండి.

5. ఆన్ లైన్ కంటెంట్

ఇది అందరికీ తెలిసిందే కానీ ఇందులో ఉండే ఆదాయం గురించి చాలామందికి ఐడియా ఉండదు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేస్తున్న వారికి చాలానే ఆదాయం ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు. మీ డైలీ లైఫ్ లో జరిగే విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవచ్చు. ట్రావెల్ వ్లాగ్స్ చేయొచ్చు. మీకు డ్యాన్స్ లేదా సింగింగ్ వస్తే దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. కామెడీ చేయొచ్చు. ఆఖరికి మీకు చిన్న పిల్లలు ఉంటే వారి బుజ్జి బుజ్జి మాటలు, ఆటలను కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ అదృష్టం బావుండి ఫాలోవర్స్ పెరిగితే.. ప్రమోషన్స్ ద్వారా కొంత ఆదాయం వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి