చేదు జ్ఞాపకాలు, బాధాకరమైన అనుభవాలు చాలా మందికి ట్రామాకు కారణమవుతాయి. అలాంటి జ్ఞాపకాలను తొలగించే లేదా వాటి ప్రభావాన్ని తగ్గించే సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆప్టోజెనెటిక్స్, ప్రొప్రానోలాల్ ఔషధం, జీన్ ఎడిటింగ్ వంటి పద్ధతులు మెదడులోని జ్ఞాపకాలను మార్చగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సాంకేతికతలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.