ఉత్తరప్రదేశ్లోని బదాయి జిల్లాకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని పింకీ శర్మ శ్రీకృష్ణుడిని తన భర్తగా ప్రకటించుకొని, ఆయన విగ్రహాన్ని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆమోదంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో ఆమె కృష్ణుడి విగ్రహంతో ఏడడుగులు నడిచింది. ఇలాంటి సంఘటనలు ఉత్తర భారతదేశంలో గతంలోనూ నమోదయ్యాయి.