Multibagger Stocks: షేర్ మార్కెట్(Share Market)లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కాలంలో డీమ్యాట్(Demat) ఖాతాలు ఓపెన్ చేయడం చాలా ఈజీగా మారింది. రిటైల్ పెట్టుబడిదారులు తరచుగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మంచి రాబడిని అందించే పెన్నీ స్టాక్(Penny Stock)ల కోసం చూస్తుంటారు. తక్కువ ధర ఉన్న కొన్ని పెన్నీ స్టాక్‌లు ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రాబడిని అందించిన రికార్డును కలిగి ఉన్నాయి. ఈ కోవకు చెందినదే టెక్స్ టైల్ రంగంలో వ్యాపారం చేస్తున్న ఎస్ఈఎల్ మ్యానుఫ్యాక్చరింగ్(SEL Manufacturing) కంపెనీ షేర్. జనవరి 2022లో రూ.55గా ఉన్న ఈ కంపెనీ ఒక్కో షేర్ విలువ.. ఏప్రిల్ 2022 నాటికి రూ.729కి చేరుకుంది. కేవలం మూడు నెలల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 1128 శాతం పెరిగింది.
ఒక ఇన్వెస్టర్ ఈ కంపెనీలో మూడు నెలల కిందట లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ.13.18 లక్షలుగా ఉండేది. ఎస్ఈఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విలువ మూడు నెలల కాలంలో 1200 శాతం మేర పెరగగా.. ఇదే కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 5.77 శాతం నష్టాన్ని నమోదు చేసింది. ఈ షేర్ 2022 ఏప్రిల్ లో తన 52 వారాల గరిష్ఠమైన రూ.1404 ను తాకగా.. 2021 అక్టోబర్ లో 52 వారాల కనిష్ఠమైన రూ.4 ను తాకింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,417 కోట్లుగా ఉంది.
గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇవీ చదవండి..
RapidEVChargeE: ఎలక్ట్రిక్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్.. ర్యాపిడ్ ఈవీ చార్జింగ్ యూనిట్!