Royal Enfield: రూ.61,000 లకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌..! సంవత్సరం వారంటీ..

|

Oct 17, 2021 | 6:23 PM

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి యువతలో ఎంత క్రేజ్‌ ఉందో అందరికి తెలిసిందే. కానీ అధిక ధర కారణంగా చాలా మంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు.

Royal Enfield: రూ.61,000 లకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌..! సంవత్సరం వారంటీ..
Royal Enfield
Follow us on

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి యువతలో ఎంత క్రేజ్‌ ఉందో అందరికి తెలిసిందే. కానీ అధిక ధర కారణంగా చాలా మంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే 2 లక్షల రూపాయల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 బైక్‌ కేవలం రూ.61 వేలకే లభిస్తుంది. ఈ బైక్‌ క్రూయిజ్ స్టైల్, 350 సిసి ఇంజన్, బ్లాక్ కలర్‌లో ఉంది. 12 నెలల వారంటీ, మనీ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. బైక్స్ 24 అనే వెబ్‌సైట్‌లో విక్రయానికి సిద్దంగా ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ సెగ్మెంట్ బైక్. బ్లాక్ కలర్‌లో వస్తున్న ఈ బైక్‌ను సులభ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ధర షోరూంలో సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుంది. అయితే మీరు ఈ చవకైన పాత డిజైన్ థండర్‌బర్డ్ 350 ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం.

Bikes24.com లో ఈ బైక్ 22 ఫోటోలు అప్‌లోడ్ చేశారు. దీని సహాయంతో బైక్ అన్ని కోణాలను గమనించవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 బైక్‌ 2014 మోడల్. ఇందులో డూప్లికేట్ కీ లేదు. అలాగే ఈ బైక్ 70 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. ఈ బైక్ ఢిల్లీకి చెందిన DL-04 RTOలో నమోదు చేసి ఉంది. ఈ బైక్ ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులు అందించారు. అంతేకాదు ఇది అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. డ్రూమ్ వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన సమాచారం ప్రకారం.. మోటార్‌సైకిల్ 346 సిసి ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్. ఇది 5,250 rpm వద్ద 19.80 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. అయితే 4,000 rpm వద్ద 28 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సమాచారం ప్రకారం ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్‌లో 36 కి.మీలు ప్రయాణిస్తుంది.

గమనిక: ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కొనడానికి ముందు దాని గురించి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. అలాగే ఈ సమాచారం Bikes24.comలో ఉంది. దీనికి టీవీ9కి ఎటువంటి సంబంధం లేదని గుర్తించండి.

Inspiring Woman: నాకు అడుక్కోవాలని లేదు.. జీవించడం కోసం పెన్నులు అమ్ముతున్నా ఒక్కటి కొన్నా చాలు అంటున్న 80 ఏళ్ల బామ్మ