Bike Sales: రూ. 35 వేలలోపు లభించే ఈ 3 బైక్‌లపై ఓ లుక్కేయండి.. బెస్ట్ మైలేజ్ కూడా.!

|

May 03, 2023 | 12:09 PM

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో భారతదేశం కూడా ఒకటి. హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్ మోటార్ వంటి బ్రాండ్లకు సంబంధించిన మోడల్స్..

Bike Sales: రూ. 35 వేలలోపు లభించే ఈ 3 బైక్‌లపై ఓ లుక్కేయండి.. బెస్ట్ మైలేజ్ కూడా.!
Second Hand Bikes
Follow us on

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో భారతదేశం కూడా ఒకటి. హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్ మోటార్ వంటి బ్రాండ్లకు సంబంధించిన మోడల్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్ తక్కువగా ఉంటే, ఈ వార్త మీకోసమే. రూ. 35 వేలలోపు లభించే ఓ మూడు బైక్‌లపై ఓ లుక్కేయండి. ప్రముఖ సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను విక్రయించే ఆన్‌లైన్ సైట్లు తక్కువ ధరకు పలు బైక్‌లను అందుబాటులో ఉంచాయి. ఇందులో హీరో ప్యాషన్ ప్రో, బజాజ్ CT 100, TVS స్పోర్ట్ లాంటివి ఉన్నాయి.

హీరో ప్యాషన్ ప్రో:

ఈ బైక్ 2019 మోడల్ OLXలో కేవలం రూ.30 వేలకే అందుబాటులో ఉంది. ఇది ఇప్పటివరకు 9,200 కి.మీ ప్రయాణించింది. ఈ బైక్ హర్యానాలోని గురుగ్రామ్‌లో లభిస్తోంది.

బజాజ్ CT 100:

ఈ బైక్ 2018 మోడల్ Bikedekho సైట్‌లో రూ.32 వేలకు అందుబాటులో ఉంది. ఈ వాహనం ఇప్పటివరకు 8,500 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో లభిస్తుంది.

TVS స్పోర్ట్:

ఈ బైక్ కూడా OLXలో అందుబాటులో ఉంది. ధర గురించి చెప్పాలంటే, ఇది రూ.32 వేలకు దొరుకుతోంది. ఈ వాహనం 2019 మోడల్‌ది. ఇప్పటివరకు 17,500 కిలోమీటర్లు నడిచింది. ఈ TVS బైక్ ఢిల్లీ లొకేషన్‌లో ఉంది.

కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.