Baba Ramdev: యోగా గురు బాబా రామ్‌దేవ్‎కు షాకిచ్చిన సెబీ.. రుచి సోయా బోర్డుకు వార్నింగ్ లేఖ..

|

Oct 05, 2021 | 7:32 PM

యోగా గురు బాబా రామ్‌దేవ్ రుచి సోయా ఎఫ్‌పీఓకు ముందు కొన్ని వ్యాఖ్యలు చేసి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ఇరుక్కుపోయారు...

Baba Ramdev: యోగా గురు బాబా రామ్‌దేవ్‎కు షాకిచ్చిన సెబీ.. రుచి సోయా బోర్డుకు వార్నింగ్ లేఖ..
Ram Dev
Follow us on

యోగా గురు బాబా రామ్‌దేవ్ రుచి సోయా ఎఫ్‌పీఓకు ముందు కొన్ని వ్యాఖ్యలు చేసి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ఇరుక్కుపోయారు. ఒక వైరల్ వీడియోలో రామ్‌దేవ్ తన అనుచరులు కోటీశ్వరులు కావాలనుకుంటే రుచి సోయా ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేయాలని సూచించడం కనిపిస్తుంది. ఫాలో-ఆన్ ఆఫరింగ్(ఎఫ్‌పీఓ) ద్వారా కంపెనీ రూ. 4,500 కోట్ల నిధుల సేకరణకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సెబీ ఆయన్ను హెచ్చరించింది. ఈ తప్పును మళ్లీ పునరావృతం చెయ్యొద్దని చెప్పింది.

రుచి సోయా యొక్క ఎఫ్‌పీఓకు ముందు రామ్ దేవ్ బాబా కొన్నివ్యాఖ్యలు చేశారు. ‘‘కోటీశ్వరుడు కావడానికి నేను నీకు మంత్రాన్ని ఇస్తున్నాను. ఈరోజే డిమ్యాట్ ఖాతాను తెరవండి. నేను మీకు చెప్పినప్పుడు రుచి సోయా షేర్లను కొనండి. ఆ తర్వాత పతంజలి షేర్లు. దీని మార్కెట్ క్యాప్ లక్షల కోట్లు ఉందనే విషయాన్ని ఏదైనా గ్లోబల్ ఏజెన్సీ మీకు తెలియజేస్తుంది’ అని హిందీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యపై రుచి సోయా బోర్డుకు సెబీ ఒక వార్నింగ్ లేఖను పంపింది. పబ్లిక్ మార్కెట్లను ట్యాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న కంపెనీ కమ్యూనికేషన్ డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే కలిగి ఉండాలని సెబీ తమ క్లాజ్‌లలో పేర్కొంది.

అలాగే సమస్యకు సంబంధించి ఏ పబ్లిక్ సమాచారంలోనూ పెట్టుబడిదారులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతరత్రా ఎలాంటి ప్రోత్సాహకాలు(ఆఫర్) ఇవ్వకూడదని సెబీ చెబుతోంది. వీటిని ఉల్లంఘించినందున రుచి సోయా బోర్డుకు సెబీ లేఖ రాసింది. ఆగస్టులో రుచి సోయా తన రూ. 4,300 కోట్ల ఎఫ్‌పీఓను ప్రారంభించడానికి సెబీ ఆమోదం పొందింది. రుచి సోయా షేర్లు 2020 లో 200 రెట్లు పెరిగాయి.

Read Also..  UAE Lottery: అబుదాబిలో భారతీయులకు అదృష్టం వరించింది.. రూ.20 కోట్ల లాటరీ.. వారి కోసం నిర్వాహకుల వెతుకులాట..!