Gemini Edibles: ఐపీవోగా రానున్న జెమిని ఎడిబుల్స్‌.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన కంపెనీ..

|

Jun 25, 2022 | 9:29 AM

యుద్ధం నేపథ్యంలో, ఉక్రెయిన్‌ నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్‌) నూనె దిగుమతిపై ప్రభావం పడటం వల్లే, దేశీయంగా వంట నూనెల ధరలు పెరిగాయని జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా (జీఈఎఫ్‌ ఇండియా) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ చౌధ్రి అన్నారు...

Gemini Edibles: ఐపీవోగా రానున్న జెమిని ఎడిబుల్స్‌.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన కంపెనీ..
Ipo
Follow us on

యుద్ధం నేపథ్యంలో, ఉక్రెయిన్‌ నుంచి పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్‌) నూనె దిగుమతిపై ప్రభావం పడటం వల్లే, దేశీయంగా వంట నూనెల ధరలు పెరిగాయని జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా (జీఈఎఫ్‌ ఇండియా) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ చౌధ్రి అన్నారు. అయితే రష్యా, అర్జెంటైనా నుంచి దిగుమతులు పెరిగినందున, నూనె ధరలు అదుపులోకి వస్తున్నాయని తెలిపారు. ఇండొనేషియా నుంచి ముడిపామాయిల్‌ ఎగుమతులు ప్రారంభం కావడంతో, పామాయిల్‌ ధర తగ్గే అవకాశం ఉందని, శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రదీప్‌ తెలిపారు. తాము ఉత్పత్తి చేస్తున్న ఫ్రీడం రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 2022 నాటికి మార్చి 31 నాటికి అమ్మకాల పరంగా మొదటి స్థానంలో నిలిచినట్లు నీల్సన్‌ ఐక్యూ సర్వేలో తేలిందని పేర్కొన్నారు.

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు: గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.10,500 కోట్ల టర్నోవర్‌ సాధించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్ల లక్ష్యాన్ని విధించుకున్నట్లు పేర్కొన్నారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు ఇప్పటికే సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసినట్లు ప్రదీప్‌ వెల్లడించారు. తెలంగాణలో రోజుకు 1,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 50 ఎకరాల్లో వంట నూనెల ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నామని, దీనికోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రదీప్‌ వెల్లడించారు. రెండేళ్లలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు.