SEBI Alert: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా? షాకింగ్ న్యూస్ మీకోసమే..

|

Sep 03, 2021 | 8:09 PM

పాన్ కార్డు విషయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చివరి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆధార్‌ని పాన్‌తో అనుసంధానానికి సంబంధించి అనేక హెచ్చరికలు జారీ చేసి..

SEBI Alert: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా? షాకింగ్ న్యూస్ మీకోసమే..
Important Alert From Sebi
Follow us on

పాన్ కార్డు విషయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చివరి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆధార్‌ని పాన్‌తో అనుసంధానానికి సంబంధించి అనేక హెచ్చరికలు జారీ చేసి.. గడువు తేదీలు పెంచినప్పటికి చాలా మంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆధార్‌కు లింక్ చెయ్యని పాన్ కార్డులను ఇన్ ఆపరేటివ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 30 తేదీని చివరి డెడ్‌లైన్‌గా ప్రకటించిన సెబీ… సెక్షన్‌ 139ఏఏ సబ్‌ సెక్షన్‌ (2) ప్రకరాం 2017 జూలై 1 వరకు జారీ చేసిన పాన్‌ కార్డులకు ఆధార్‌ లింకేజి తప్పనిసరని పేర్కొంది. నిర్ణీత గడువులోపు అనుసంధానం చేయని పక్షంలో..ఇన్‌కం ట్యాక్స్‌ న్యూ రూల్ 114ఏఏఏ ప్రకారం..ఆయా ఖాతాలను ఇన్‌ఆపరేటివ్‌ చేయనున్నట్లు తెలిపింది.

పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు అల్టిమేటం ఇవ్వబడింది. ఈ తేదీ నాటికి మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ చేయకపోతే అది క్లోజ్ చేస్తామని హెచ్చరించింది. ఇప్పుడు CBDT సూచనలను అనుసరించి సెబీ ఈ  ఆదేశాలు జారీ చేసింది.

వోటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి మీకు ఇప్పటికే తెలిసినట్లుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌లలో చేర్చబడ్డాయి. మీకు ఇది తరచుగా అవసరం. ఎలాంటి ఆర్థిక లావాదేవీలకైనా మీకు పాన్ నంబర్ అవసరం.

మీ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html ఓపెన్ చేయాలి. అందులో రెండు బాక్సులు కనిపిస్తాయి.

  1. PAN అని ఉన్న బాక్సులో మీ పాన్ నెంబర్, Aadhaar Number అని ఉన్న బాక్సులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఓసారి సరిచూసుకోవాలి. ఆ తర్వాత View Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి.
  2. Your PAN linked to Aadhaar Number అని మెసేజ్ కనిపిస్తే ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయినట్టే. ఈ ప్రాసెస్ ద్వారా మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది.
  3. అంతేకాదు మీ పాన్ కార్డ్ ఏ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిందో కూడా తెలుస్తుంది. ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి.
  4. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా పాన్, ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు. UIDPAN < 12 digit Aadhaar number> < PAN Card Number> అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Taliban Panjshir: 450 మంది తాలిబన్లు హతం.. మరోసారి పంజా విసిరిన పంజ్‌షేర్‌..