Google: మీరు గూగుల్‌లో వీటి కోసం వెతుకుతున్నారా..? ఇక మోసపోవాల్సిందే.. తస్మాత్‌ జాగ్రత్త..!

|

Sep 20, 2021 | 8:01 PM

Google: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఎన్నో పనులు చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఏదైనా అలాగే ఏదైనా కస్టమర్‌..

Google: మీరు గూగుల్‌లో వీటి కోసం వెతుకుతున్నారా..? ఇక మోసపోవాల్సిందే.. తస్మాత్‌ జాగ్రత్త..!
Follow us on

Google: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఎన్నో పనులు చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఏదైనా అలాగే ఏదైనా కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కావాలంటే గూగుల్‌లో సెర్చ్‌ చేస్టే ఇట్టే దొరికిపోతుంది. టెక్నాలజీ పరంగా ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా మనకు గూగులే దిక్కు. ఈ 4జీ యుగంలో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు.. ఫోన్లోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అయితే గూగుల్ సెర్చ్‌లో ‌ఏది వెతికినా దొరికేస్తుందని మనందరికి తెలిసిందే. కానీ కొన్నింటి సమాచారం గూగుల్‌లో వెతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు టెక్‌ నిపుణులు. ముఖ్యంగా బ్యాంకింగ్‌కు సంబంధించిన అంశాల్లో ఎన్నో ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగానికి చెందిన కస్టమర్‌ కేర్‌ నెంబర్లు గూగుల్‌లో వెతుకుతున్నారు. ఇలా వెతకడం చేయకపోవడమే మంచిదంటున్నారు ఎస్‌బీఐ అధికారులు. వీలైనంత వరకు ఇలాంటి నంబర్ల కోసం సెర్చ్ చేయక పోవడమే మంచిదని, లేకపోతే ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలియకుండా సెర్చ్ చేస్తే అనవసరంగా సైబర్ నేర‌గాళ్ల వలలో చిక్కే ప్రమాదం ఉంటుంది.

ఇక సైబరాబాద్ పరిధిలో 1395 కేసుల్లో ఇలాంటి మోసాలే ఎక్కువగా తెలుస్తోంది. 189 కేసుల్లో బాధితులు రూ.1.01 కోట్ల డబ్బులు పోగొట్టుకున్నారు. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, ట్రావెల్స్‌, కొరియర్‌, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి సంస్థలకు చెందిన కస్టమర్ కేర్ నంబర్లు కోసం చాలానే మంది సర్చ్ చేస్తున్నారు. అయితే సైబర్ మోసగాళ్లు గూగుల్ యాడ్స్ కొనుగోలు చేసి నకిలీ వివరాలను పోస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే, గూగుల్ సర్చ్ ఇంజిన్(ఎస్ఈఓ) ద్వారా సైబర్ నెరగాళ్లు వారి పేర్కొన్న మొబైల్ నెంబర్ మొదట వచ్చే విధంగా చేస్తున్నారట.

అందుకే గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటున్నారు పోలీసులు, బ్యాంకు అధికారులు. ప్రతి సంస్థకు వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ఉంటుంది. అక్కడి నుంచే తీసుకోవాలి తప్ప గూగుల్‌లో సెర్చ్‌ చేయడం మంచిది కాదంటున్నారు. ఒకవేళ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఇటువంటి మోసల గుర్తించి బ్యాంకులు తమ ఖాతాదారులును అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) ఇలాంటి స్కామ్స్ గురించి వినియోగదారులను హెచ్చరిస్తూ ఒక వీడియోను ట్వీట్ చేసింది.

 

ఇవీ కూడా చదవండి:

Whatsapp: మీ మొబైల్‌లో సేవ్‌కాని నంబర్లకు వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలా.. ఇలా చేయండి..!

Apple iOS 15: ఐఫోన్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఆసక్తికరమైన ఫీచర్స్‌ ఇవే..!

Google Images: మీకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో దొరకడం లేదా..? ఇలా చేయండి..!