Telugu News Business SCR Extends Special Weekly Train Services: Relief for Post Sankranti Passenger Rush
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్పెషల్ రైళ్లు మరికొన్ని రోజులు పొడిగింపు!
సంక్రాంతి పండుగ ముగిసినా రైల్వే ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వీక్లీ స్పెషల్ రైలు సేవలను మరికొన్ని రోజులు పొడిగించింది. ఫిబ్రవరి వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
సంక్రాంతి పండుగ ముగిసినప్పటికీ రైల్వే ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ గమ్యస్థానాలకు వెళ్తున్న వీక్లీ స్పెషల్ రైలు సేవలు మరికొన్ని రోజులు పొడిగించింది. ప్రస్తుతం టిక్కెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి ఈ పొడగింపు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రతి ట్రైన్ 4 ట్రిప్పులు నడవనుంది.
రైలు నంబర్ 07191 కాచిగూడ టు మధురై (సోమవారం) 02.02.2026 నుంచి 23.02.2026
రైలు నంబర్ 07192 మధురై టు కాచిగూడ (బుధవారం) 04.02.2026 నుంచి 25.02.2026
రైలు నంబర్ 07193 హైదరాబాద్ టు కొల్లం (శనివారం) 31.01.2026 నుంచి 21.02.2026
రైలు నంబర్ 07194 కొల్లం టు హైదరాబాద్ (సోమవారం) 02.02.2026 నుంచి 23.02.2026
రైలు నంబర్ 07230 హైదరాబాద్ టు కన్యాకుమారి (బుధవారం) 04.02.2026 నుంచి 25.02.2026
రైలు నంబర్ 07229 కన్నియాకుమారి టు హైదరాబాద్ (శుక్రవారం) 06.02.2026 నుంచి 27.02.2026
రైలు నంబర్ 07219 నరసాపూర్ టు తిరువణ్ణామలై (బుధవారం) 04.02.2026 నుంచి 25.02.2026
రైలు నంబర్ 07220 తిరువణ్ణామలై టు నర్సాపూర్ (గురువారం) 05.02.2026 నుంచి 26.02.2026