School Holidays: జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?

|

Jun 30, 2024 | 7:00 PM

జూలై నెలలో వారపు సెలవులు కాకుండా పాఠశాలలు, కళాశాలలకు కొన్ని రోజులు సెలవులు ఉండబోతున్నాయి. జూన్ నెలను వేసవి సెలవుల నెల అంటారు. ఇందులో దాదాపు అన్ని చోట్లా వేసవి సెలవులు ముగియనుండడంతో ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకుని పాఠ్యాంశాలు కూడా మొదలయ్యాయి. జూలై 1 నుంచి ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులందరికీ పాఠశాలలు..

School Holidays: జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?
School Holidays
Follow us on

జూలై నెలలో వారపు సెలవులు కాకుండా పాఠశాలలు, కళాశాలలకు కొన్ని రోజులు సెలవులు ఉండబోతున్నాయి. జూన్ నెలను వేసవి సెలవుల నెల అంటారు. ఇందులో దాదాపు అన్ని చోట్లా వేసవి సెలవులు ముగియనుండడంతో ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకుని పాఠ్యాంశాలు కూడా మొదలయ్యాయి. జూలై 1 నుంచి ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులందరికీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో జూలై నెలకు ఎన్ని సెలవులు వస్తాయో తెలుసుకోవాలి. జూలై నెలలో పాఠశాలలు, కళాశాలలు ఎప్పుడు సెలవు ఉంటుందో తెలుసుకుందాం.

ప్రతి నెల మాదిరిగానే జూలైలో కూడా నెలలో నాలుగు రోజుల పాటు సాధారణంగా సెలవులు ఉంటాయి. వాటి నిర్వహణ ఆధారంగా పాఠశాలలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. ఆదివారంతో పాటు రెండో, నాలుగో శనివారాల్లో సెలవు ఉంటుంది. అధికారికంగా నాలుగు ఆదివారాలతో పాటు మరో రోజు కూడా సెలవు ఉంటుంది. జూలై 17 బుధవారం ముహర్రం పండగ సందర్భంగా భారతదేశం అంతటా పాఠశాలలు మూసి ఉండనున్నాయి. చాలా చోట్ల పిల్లలకు నెలలో రెండో, నాలుగో శనివారాల్లో సెలవులు ఉంటున్నాయి.

అయితే ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం ఒకటి. కొన్ని ప్రాంతాల్లో ఈ పండ‌గ‌ను పీర్ల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు. మొహర్రం మాసంలో పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అందుకే జూలై 17వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

జూలై సెలవుల జాబితా

  • 07 జూలై : ఆదివారం
  • 13 జూలై: మొదటి శనివారం
  • 14 జూలై: ఆదివారం
  • 17 జూలై: ముహర్రం
  • 21 జూలై: ఆదివారం
  • 27 జూలై: నాల్గవ శనివారం
  • 28 జూలై: ఆదివారం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి