Personal Loan Interest Rates: మీకు అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్ సరైన ఎంపిక. చాలా బ్యాంకులు 9%కంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తున్నాయి. ఒకసారి ఏయే బ్యాంకు ఎంత వడ్డీకి పర్సనల్ లోన్ ఇస్తున్నాయో చెక్ చేసుకుని.. ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. వడ్డీ రేటుతో పాటు ఆయా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుల కింద ఎంత వసూలు చేస్తున్నాయన్న అంశాన్ని కూడా లోన్ తీసుకునే ముందు పరిగణలోకి తీసుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.55 శాతం నుంచి 12.90 శాతానికి మధ్య పర్సనల్ లోన్స్ ఇస్తోంది. ఐదేళ్లలో తిరిగి చెల్లించేలా లక్ష రూపాయల రుణం తీసుకుంటే 8.55 శాతం వడ్డీ అయితే రూ.2,054 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే 12.90 శాతం వడ్డీరేటుతో పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రతినెలా రూ.2,270 ఈఎంఐ కింద చెల్లించాల్సి ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.70 శాతం నుంచి 13.55 శాతం వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇస్తోంది. ఐదేళ్లలో తిరిగి చెల్లించేలా 8.70 శాతం వడ్డీపై లక్ష రూపాయల రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.2,061 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 13.55 శాతం వడ్డీపై పర్సనల్ లోన్ తీసుకుంటే రూ.2,304 చెల్లించాల్సి ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్ 9.05 శాతం నుంచి 13.65 శాతం వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇస్తుండగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.30 శాతం నుంచి 13.40 శాతానికి.. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 9.50 శాతం నుంచి 11.50 శాతానికి.. ఐడీబీఐ బ్యాంక్ 9.50 శాతం నుంచి 14 శాతం వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.60 శాతం నుంచి 13.85 శాతానికి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.85 శాతం నుంచి 10.05 శాతం వడ్డీకి.. కొటాక్ మహీంద్ర బ్యాంక్ 10.25 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీతో పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. యూకో బ్యాంకు 10.30 శాతం నుంచి 10.55 శాతం వరకు వడ్డీతో పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి.
పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు ఇతర ఫీజులు, ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి. లోన్ తీసుకునే ముందు వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్న విషయంలో తుదినిర్ణయం తీసుకోవాలి.
నోట్: ఈ నెల 23వ తేదీ వరకు ఆయా బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్స్‌లో ఉంచిన పర్సనల్ వడ్డీరేట్ల వివరాల ఆధారంగా ఈ వివరాలను మీకు అందించడం జరుగుతోంది. కచ్చితమైన పర్సనల్ లోన్ రేటు వివరాల కోసం ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read..
India Covid-19: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గత 24గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?
Crow Attack on Drone Viral Video: డ్రోన్ పై దాడిచేసిన కాకి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..