దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందించడంలో ఈ బ్యాంక్ ముందుంటుంది. ఇండియాలోనే ఈ బ్యాంకు కస్టమర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే తాజాగా ఎస్బీఐ తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. బ్యాంక్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే ముందు కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవాలని సూచిస్తుంది. బ్యాంక్ ఇప్పటికే అనేక నియమాలను విడుదల చేసింది. ఎస్బీఐ ప్రవేశ పెట్టిన నియమాలను పాటించకపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోలేరు. అందుకే ముందుగానే నియమాలను తెలుకోవాలని హెచ్చరిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ కస్టమర్లు డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని పరిమితులను నిర్ణయించింది. హోం బ్రాంచ్, ఇతర బ్రాంచులకు వేర్వేరు పరిమితులను రివీల్ చేసింది. డబ్బు విత్ డ్రా, చెక్ ద్వారా విత్ డ్రా చేసుకోనే నియమాలలో కొన్ని మార్గనిర్ధేశకాలను ప్రవేశపెట్టింది. ఇటీవల ఎస్బీఐ ఖాతాదారుడు ట్విట్టర్ వేదికగా.. విత్ డ్రా లిమిట్స్ గురించి ఎస్బీఐని ప్రశ్నించాడు. ఇందుకు ఎస్బీఐ స్పంధిస్తూ… ఇతర బ్రాంచుల నుంచి రూ.25 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని.. తెలిపింది. నాన్ హోమ్ బ్రాంచ్ ద్వారా చెక్ ద్వారా మనీ విత్ డ్రా చేసుకోవడాన్ని ఎస్బీఐ రెట్టింపు చేసింది. ఇంతకు ముందు ఇతర బ్రాంచుల నుంచి కేవలం రూ.50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు లక్ష రూపాయాల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే విత్ డ్రా స్లిప్ నుంచి రూ.25వేల వరకు పరిమితి ఉంది.
ట్వీట్..
Today I went @TheOfficialSBI Branch for cash withdrawal around 100k. Cashiers refused to provide cash.
Clarification from officer
This is not your home Branch, you can only withdrawal 5k.
Very bad service experienced today.
I’ll switch account in private bank.@TheOfficialSBI— Vaibhav.. (@Vaibhav_MH11) June 30, 2021
ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలలో నాలుగు సార్లు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగు సార్లు విత్ డ్రా లిమిట్ ముగిసిన తర్వాత మరోసారి మీరు మనీ తీసుకోవడానికి అదనంగా రూ.15 తోపాటు.. జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రతి వినియోగదారునికి 10 పేజీల చెక్ బుక్ ఇవ్వనున్నట్లుగా ఎస్బీఐ తెలిపింది. ఒకవేళ మరోక చెక్ బుక్ తీసుకోవాలనుకుంటే రూ. 40 తోపాటు.. జీఎస్టీ చెల్లించాలి. అదే 25 పేజీల చెక్ బుక్ తీసుకోవాలనుకుంటే.. రూ.75 చెల్లించాలి. అత్యవసర చెక్ బుక్ కావాలంటే రూ. 50తోపాటు.. జీఎస్టీ చెల్లించాలి.
Also Read: CM KCR Review: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. నీటి పారుదల ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష