SBI Offer: మీరు టూ వీలర్ లోన్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే ఎస్బీఐ మీకు బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. వాస్తవానికి స్టేట్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఈ స్పెషల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లు మొదటగా రూ.10 వేల 251 వరకు EMI చెల్లించాలి. అంటే ఒక లక్ష రూపాయల బైక్ కోసం కస్టమర్లు నెలకు రూ.2510 EMI చెల్లించాలి. దీంతో పాటు బ్యాంకు రుణాలపై మరిన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.
ఈ ఆఫర్ ఫీచర్లు ఏంటి..?
ఈ ఆఫర్ కింద రూ.20,000 నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకు రుణం అందిస్తోంది. ఈ లోన్ గరిష్టంగా 48 నెలల కాలానికి అందిస్తుంది. రుణంపై వడ్డీ రేట్లు 9.35 శాతం నుంచి ప్రారంభమవుతుంది. వాహనం ఆన్-రోడ్ ధరలో గరిష్టంగా 85 శాతం వరకు బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఇది కస్టమర్ ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు. YONO యాప్ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. రుణం కోసం ఖాతాదారుడు బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. షరతులను నెరవేర్చిన కస్టమర్ రుణం వెంటనే ఆమోదిస్తారు. నేరుగా మొత్తం డీలర్ ఖాతాలోకి విడుదల చేస్తారు. బ్యాంక్ ప్రత్యేక ఆఫర్ కింద మార్చి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు ఉంటుంది.
ఎవరికి రుణ సౌకర్యం లభిస్తుంది..
బ్యాంక్ ఈ ఆఫర్ ప్రీ-అప్రూవ్డ్ కేటగిరీలో ఉంది. అంటే బ్యాంకుతో కస్టమర్‌కు ఉన్న సంబంధాల ఆధారంగా ఈ ఆఫర్ వారికి అందిస్తారు. కస్టమర్ ఇంట్లో కూర్చొని తన ఇంటి నుంచి ఈ విషయాలు తెలుసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ప్రకారం ప్రస్తుతం ఈ ఆఫర్ కోసం బ్యాంక్ నిర్దిష్ట వర్గం కస్టమర్లను ఎంపిక చేసింది. ఈ లోన్ ఆఫర్ చేయబడిన కస్టమర్‌లు కొన్ని సులభమైన దశలతో ఇంట్లో కూర్చొని ఈ సదుపాయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం యోనో యాప్ సహాయం తీసుకోవాలి.
ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి..?
ఈ ఆఫర్ గురించి బ్యాంక్ కస్టమర్లకు మెస్సేజ్ లేదా ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను స్వీకరించారా వద్దా అనేది బ్యాంకుకు వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్‌ను పొందినట్లయితే యోనో యాప్ సహాయంతో లోన్ మొత్తాన్ని పొందవచ్చు. ఇందుకోసం ముందుగా యోనో యాప్‌కు లాగిన్ అవ్వాలి. దీని తర్వాత మీరు యాప్‌లోని ఆఫర్ బ్యానర్‌పై దరఖాస్తుపై క్లిక్ చేయాలి. కొత్త పేజీలో మీరు మీ సమాచారాన్ని తెలియజేయాలి. తర్వాత మీరు డీలర్, వాహనం వివరాలను నింపాలి. వాహనం ఆన్-రోడ్ ధరను ఇవ్వాలి. బ్యాంక్ ఇచ్చిన సమాచారాన్ని చదివిన తర్వాత మీరు ఆఫర్‌ను అర్థం చేసుకుంటే నిబంధనలు, షరతులను అంగీకరించాలి. ఈ పూర్తి ప్రక్రియ తర్వాత మీరు బ్యాంక్ నుంచి డీల్ కోసం OTPని పొందుతారు. దాన్ని పూరించిన తర్వాత మీ లోన్ ఆమోదిస్తారు. డీలర్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.