SBI Life Sampoorn Suraksha: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా..? అయితే మీకో శుభవార్త. మీరు రూ.40 లక్షల వరకు ఇన్‌స్టంట్ లైఫ్ కవరేజీతో ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పేరుతో అందిస్తున్న ప్రత్యేక పాలసీల్లో ఇదొకటి. ఎస్‌బీఐ కస్టమర్లు ఎవరైనా ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌లో కేవలం కొన్ని క్లిక్స్‌తో సులభంగా ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవచ్చు. ఇది గ్రూప్, నాన్ లింక్‌డ్, నాన్ పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ.
ఈ పాలసీ తీసుకున్నవారికి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మద్దతుగా నిలుస్తోంది ఈ పాలసీ. కనీసం రూ.1,00,000 నుంచి రూ.40,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ఎంచుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ప్రతీ ఏటా ప్రీమియం కస్టమర్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ ఏడాది మాత్రమే. 55 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ చేయవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారు మరణిస్తే సమ్ అష్యూర్డ్ నామినికి అందిస్తారు. రైడర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ పాలసీపై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మరి ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.
ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత insurance సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ Buy a Policy ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయాలి. ఆ తర్వాత SBI Life – Sampoorn Surakasha సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సమ్ అష్యూర్డ్, పుట్టిన తేదీ, నామినీ వివరాలు వంటివి నమోదు చేయాలి. తర్వాత సెక్షన్‌లో హైట్, వెయిట్ సెలెక్ట్ చేయాలి. ఏవైనా అనారోగ్యాలు ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. చివరగా పేమెంట్ అక్కడే పూర్తి చేసుకోవచ్చు.
Get life cover on YONO instantly* in few steps. *T&C Apply. Download now: https://t.co/NeeHLbI8DP#SampoornSuraksha #LifeCover #Protection #YONOSBI #YONO pic.twitter.com/QutiODrRXy
— State Bank of India (@TheOfficialSBI) April 8, 2021
ఇవీ చదవండి: LPG Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా..? రూ.50 లక్షల వరకు బెనిఫిట్.. ఎలాగంటే..!